Nellore Scandal: ఎక్కడో నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామంలో పెద కుటుంబంలో పుట్టిన ఆమె.. తనకు అడ్డుగా ఉన్నాడని భర్తను వదిలించుకుంది. రోడ్డు ప్రమాదంలో లేపేసి.. విచారణకు దిగిన పోలీసు అధికారిని ట్రాన్స్ఫర్ చేయించింది. అంతేకాదు తనకు అత్యంత సన్నిహితమైన ఒక ఖైదీని.. యవజ్జీవ శిక్ష పడినప్పటికీ.. సెక్రటేరియట్ రేంజ్ లో లాబీయింగ్ చేయించుకుని బెయిల్ ఇప్పించుకుంది. 2010 నుంచి నెల్లూరు కేంద్ర కారగారంలో ఆ వ్యక్తి ఖైదీగా ఉన్నాడు. 2014లో జైలు నుంచి తప్పించుకొని పారిపోయాడు. 2018లో మళ్లీ పోలీసులకు దొరికిపోయాడు. అప్పట్నుంచి అతడు జైల్లోనే ఉంటున్నాడు. ఇటీవల బెయిల్ కోసం అతడు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అతడు బయటికి వస్తే తీవ్రమైన నేరాలకు పాల్పడే అవకాశం ఉందని.. అతడికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దని తిరుపతి, నెల్లూరు జిల్లాల పోలీసులు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
Also Read: ఓ కూలి.. తాను చనిపోయినా.. ఏడుగురి ప్రాణాలను నిలబెట్టాడు!
ఇంతమంది అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆకిలేడి తనకున్న పరిచయాలతో అతడిని బయటికి తీసుకొచ్చింది. ఇన్ని రోజుల వరకు ఆ వ్యక్తి కేంద్ర కారగారంలో ఉంటే.. అతని పేరు మీద ఆ మహిళ నేరాలు చేసింది. దందాలు చేసింది. నెల్లూరు జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులతో పాటు సచివాలయంలోని కొంతమంది ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని.. బెయిల్ మంజూరు చేయించుకుంది. నిబంధన ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక ఖైదీని ఎవరూ కలవడానికి అవకాశం లేదు. అయితే ఆ మహిళ మాత్రం అతడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తోంది. పైగా ఆస్పత్రిలోనే అతనితో సరసాలు ఆడింది. వీటిని ఆమె ఏకంగా వీడియో రికార్డింగ్ చేయించుకుంది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రెస్ మీట్ తొ బయటకొచ్చిందిగా.. జగనన్న అభిమాని, “డైమండ్ ” నిడిగుంట అరుణ.
జగనన్న అభిమానురాలిగా…
వైసీపీ అభిమానిగా 2024 ఎలక్షన్ లో జగనన్న కు వెన్నుపోటు పొడవాలని “డైమండ్” గుర్తుపై ఇండిపెండెంట్ అభ్యర్థి గా పోటీ చేసారు కదా… అరుణ గారు.! #JustAsking #Nellore pic.twitter.com/S7unCscnq6— Kaza RajKumar (@KazaRajKumar) August 17, 2025
ఆ మహిళ గతంలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దిశా యాప్ ప్రచారకర్తగా కొనసాగింది. ప్రస్తుత నెల్లూరు ఎమ్మెల్యేను తీవ్రస్థాయిలో విమర్శించింది.. మాటల్లో చెప్పలేని విధంగా బూతులు తిట్టింది. ఇప్పుడు ఏపీలో అధికారం మారిపోవడంతో కొద్దిరోజులుగా సైలెంట్ అయిపోయిన ఆమె.. ఇప్పుడు మళ్లీ తన హవాను ప్రదర్శిస్తోంది. ఇటీవల కాలంలో తన దందాలను మళ్లీ మొదలుపెట్టి. ఏకంగా పోలీసు అధికారులను బదిలీ చేయించుకునే స్థాయికి తన రేంజ్ పెంచుకుంది. ఏకంగా డీఐజీ స్థాయి అధికారులతో టచ్ లో ఉంటూ తాను అనుకున్న పనులు మొత్తం చేస్తోంది. అంతేకాదు గతంలో ఒక ఏఎస్పీతో ఆమె అంట కాగింది. అతడితోనే ఐ లవ్ యు చెప్పించుకుంది. దానికి సంబంధించిన వీడియోలు.. ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో హవా కొనసాగించి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ తన దందా సాగిస్తున్న ఆమె.. నెల్లూరులో సమాంతర వ్యవస్థలను కొనసాగిస్తున్నారు.. అయితే ఈమె దందాలకు, వ్యవహారాలకు కూటమి ప్రభుత్వం ముకుతాడు వేయాలని టిడిపి నేతలు కోరుతున్నారు. మరి ఆ దిశగా కూటమి ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకుంటారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.
నేరస్తుడితో అరుణ పుష్ప సినిమా డ్యూయెట్స్ | Nidigunta aruna romance video viral ! | Mahaa News #nidiguntaaruna #ysrcp #nellore #ips #mahaanews pic.twitter.com/73MOqCjteh
— Mahaa News (@MahaaOfficial) August 17, 2025
మహాన్యూస్ బిగ్ బ్రేకింగ్..వైరల్ అవుతున్న అరుణ రొమాన్స్ వీడియో Mahaa News Big Breaking | Nidugunta Aruna Additional SP Romance Video Viral ! #nidiguntaaruna #ysrcp #nellore #ips #mahaanews pic.twitter.com/0zkP7ldWug
— Mahaa News (@MahaaOfficial) August 17, 2025