CM Revanth Reddy: ఏ రాష్ట్రానికి అయినా సరే పెట్టుబడులు చాలా అవసరం. ఎందుకంటే పెట్టుబడుల ద్వారానే ఆదాయం సమకూరుతూ ఉంటుంది. ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పెట్టుబడుల కోసమే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి దావోస్ వెళ్లిపోయారు…
దావోస్ ప్రాంతంలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. తెలంగాణ రైజింగ్ పేరుతో ఆయన పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 23 వేల కోట్ల పెట్టుబడిలను పెట్టేందుకు అనేక సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. డక్టైల్ ఐరన్ పైపుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా పేరున్న రష్మీ గ్రూపు తెలంగాణ రాష్ట్రంలో 12,500 కోట్ల పెట్టుబడితో స్టీలు ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయనుంది. స్లోవేకియ దేశానికి చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్ సంస్థ 6000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. స్మాల్ మాడ్యూల్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు ను తెలంగాణలో ఏర్పాటు చేయబోతోంది.
సౌందర్య ఉత్పత్తుల తయారీలో పేరు ఎన్నికల లోరియల్ అనే సంస్థ 3500 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ టెక్ హబ్ ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతోంది. అమెరికాలో విమానయాన రంగంలో పేరుపొందిన సర్గార్డ్ అనే సంస్థ.. దశలవారీగా 1 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈనెల 23 వరకు ఈ సదస్సు జరుగుతుంది. ఇందులో భాగంగా అనేక సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. రష్మీ గ్రూప్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 12,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా బీర్లను తయారు చేసే అతిపెద్ద కంపెనీగా పేరు తెచ్చుకున్న ఏబి ఇన్ బెవ్.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తన తయారీ యూనిట్ ను మరింత విస్తరించబోతోంది. దీనికోసం భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. తద్వారా వేలాది మందికి ఉపాధి లభించబోతోంది. బ్లైజ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు దినకర్ మునగాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇప్పటికే తమ సంస్థ ఆధ్వర్యంలో రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.. త్వరలోనే హెల్త్ కేర్ డయాగ్నస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటో మేషన్, ఎనర్జీ ఎఫిషియన్సీ వంటి రంగాలలో పెట్టుబడులు పెడతామని దినకర్ వెల్లడించారు. గత ఏడాది జరిగిన సదస్సులో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. ఈసారి కూడా అదే స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నది.