HomeతెలంగాణWife viral reaction for Husband non veg issue: నాన్ వెజ్ ఎందుకు వండలేదన్న...

Wife viral reaction for Husband non veg issue: నాన్ వెజ్ ఎందుకు వండలేదన్న భర్త.. భార్య చేసిన ఆ పని వైరల్

Wife viral reaction for Husband non veg issue: అప్పట్లో బలగం సినిమా వచ్చినప్పుడు.. మూలుగ ఒక కోసం ఆ స్థాయిలో కుటుంబాల మధ్య గొడవలు జరుగుతాయని చాలామంది అనుకున్నారు. సినిమా కోసం ఈ స్థాయిలో నాన్ వెజ్ కోసం కుటుంబ సంబంధాలను పలచన చేస్తారా అప్పట్లో కొంతమంది ప్రశ్నించారు. వాస్తవానికి నాన్ వెజ్ అంటే తెలంగాణలో చాలామందికి ఇష్టం. ముఖ్యంగా వేడుకల సమయంలో మటన్ కు విపరీతమైన ప్రయారిటీ ఇస్తుంటారు. కొన్ని సందర్భాలలో నాన్ వెజ్ కోసం కొట్లాటలు కూడా జరుగుతుంటాయి.

నాన్ వెజ్ కోసం జరిగే కొట్లాటలు కొన్ని సందర్భాలలో దారుణాలకు కూడా కారణం అవుతుంటాయి. ఆ సమయంలో ప్రాణాలు కూడా పోతుంటాయి. అటువంటి సంఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆవేశానికి పోయిన భర్త భార్యను మందలించాడు. చివరికి ఆమె చేసిన పని సంచలనంగా మారింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నగరంలో శివాజీ, లక్ష్మీ దంపతులు నివాసం ఉన్నారు. వీరికి చాలా సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఐదు సంవత్సరాలు, రెండు సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం శివాజీ మాంసం తీసుకొచ్చాడు. దాన్ని వండాలని లక్ష్మికి సూచించాడు. అయితే ఆమె వండలేదు. దీంతో ఆరోజు రాత్రి ఇంటికి వచ్చిన శివాజీ.. కూర గిన్నె మూత తీసి చూశాడు. అందులో మాంసం కూర కనిపించలేదు. కూర ఎందుకు లేదని భార్యను అడిగాడు. దానికి ఆమె వండలేదని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కాస్త ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో లక్ష్మి ఇంట్లో ఉన్న కొడవలితో భర్త మెడ మీద గట్టిగా ఒక వేటు వేసింది. దీంతో అతడు సంఘటన స్థలంలోనే చనిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లక్ష్మి అదుపులోకి తీసుకున్నారు. క్షణకాలంలో ఆవేశానికి గురైన లక్ష్మి భర్తను చంపడం స్థానికంగా కలకలం రేపింది. నాన్ వెజ్ విషయంలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ చివరికి భర్త ప్రాణాలు తీసింది. తండ్రి చనిపోవడం
.. తల్లి జైలుకు వెళ్లడంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. ఆ కుటుంబం మొన్నటిదాకా సంతోషంగా ఉండేది. కానీ నాన్ వెజ్ వండే విషయంలో జరిగిన గొడవ ఆ కుటుంబాన్ని ఆగం చేసింది.. ఇటువంటి పరిస్థితి ఏ భర్తకు రాకూడదని స్థానికులు అంటున్నారు.

“మొదటినుంచి కూడా లక్ష్మిది వివాదాస్పదమైన శైలి. ఆమె భర్తతో తరచూ గొడవ పడుతూ ఉండేది. అతడికి సరిగ్గా వండి పెట్టేది కాదు. నాన్ వెజ్ విషయంలో శివాజీ అడిగినందుకే లక్ష్మీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అందువల్లే శివాజీని కొడవలితో చంపేసిందని” స్థానికులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version