డిమ్డ్ యూనివర్సిటీలు అన్నీ ‘యూనివర్సిటీల’ పేరుతో విద్యార్థులను ఆకర్షిస్తున్న వైనంపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. డిమ్డ్ యూనివర్సిటీ హోదా పేరుతో ఉన్న కొన్ని కాలేజీలు యూన్సివర్సిటీలు ప్రకటనలు గప్పిస్తూ భారీ ఫీజులతో విద్యార్థులను ఆకర్షించడం తప్పని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు కాలేజీలు కరస్పాండెన్స్ ఇంజనీరింగ్ డిగ్రీలు జారీచేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంతో డిమ్డ్ యూనివర్సిటీపై తగు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు యూజీసీని ఆదేశించింది. దీంతో ఇన్నిరోజులు స్తబ్దుగా ఉన్న యూజీసీ ఉన్నఫలంగా పలు డిమ్డ్ యూనివర్సిటీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: మారటోరియంలోనూ లోన్లు కట్టారా..! : మీకో శుభవార్త
కొన్ని రాష్ట్రాల్లో డిమ్డ్ యూనివర్సిటీ సొంతంగా కరస్పాండెన్స్ కోర్సులు నిర్వహిస్తూ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాయి. కొన్ని డిమ్డ్ యూనివర్సిటీలు సొంతంగా యూనివర్సిటీలుగా చెలమణి అవుతోన్నాయి. తమ యూనివర్సిటీ పేరుతో రకరకాల కోర్సులను ప్రవేశపెడుతూ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాయి. కానీ అవన్నీ డమ్డ్ టు యూనివర్సిటీల పేరుతోనే ఇవ్వాలని కానీ యూన్సివరిటీ అన్నట్టుగా విద్యార్థులను మోసం చేస్తున్నాయని సుప్రీం కోర్టు ఆక్షేపించింది.
డీమ్డ్ యూనివర్సిటీ హోదాతో రాజస్తాన్.. తమిళనాడు రాష్ట్రాల్లో నాలుగు కాలేజీలు కరస్పాండెట్ కోర్సులో ఇంజనీరింగ్ డిగ్రీలు జారీ చేయడంపై సుప్రీం కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు వీటితో సహా దేశంలోని అన్ని డీమ్డ్ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈమేరకు యూజీసీ తాజాగా దేశంలోని 123 కాలేజీలకు ఇచ్చిన ‘యూనివర్సిటీ’ హోదాను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ కాలేజీలు తమ పేరు చివర ‘యూనివర్సిటీ’ అని పెట్టుకోకూడదని ఆదేశించింది. ఈ కాలేజీలన్నీ మళ్ళీ కొత్తపేరు కోసం కేంద్ర మానవ వనరుల శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో డీమ్డ్ యూనివర్సిటీ హోదా దూరవిద్య ద్వారా జారీ చేసిన బిటెక్(ఇంజనీరింగ్) డిగ్రీలను కూడా రద్దు చేసింది. దీంతో ఆ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.
Also Read: ‘అటల్ టన్నెల్’ తో దేశానికి ఏం ఉపయోగం?
యూజీసీ తాజా నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు కళాశాలలు యూనివర్సిటీ హోదాను కోల్పోయాయని సమాచారం. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని కాలేజీలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ కళాశాలలు పేరు చివరన యూనివర్సిటీ అనే పెట్టుకోవడానికి వీల్లేదని యూజీసీ స్పష్టం చేసినట్టు తెలిసింది.