HomeతెలంగాణTVK Congress Support: టీవీకేకు కాంగ్రెస్ మద్దతు.. జగన్ ఏమంటారు?!

TVK Congress Support: టీవీకేకు కాంగ్రెస్ మద్దతు.. జగన్ ఏమంటారు?!

TVK Congress Support: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తారు. కానీ రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇండియా కూటమిని కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ చేస్తుందని దానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధి అయిన భారతీయ జనతా పార్టీ విషయంలో సానుకూలంగా ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే తమిళనాడులో విజయ్ గెలుపుతో సంబరాలు చేసుకున్నారు. ఆ విజయాన్ని జగన్ ఖాతాలో వేస్తారు. జగన్మోహన్ రెడ్డికి చెప్పి విజయ్ రాజకీయ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయితే అంతా బాగుంది కానీ అదే విజయ్ కు.. కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడం మాత్రం జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలినట్లు అయింది. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సలహాలను విజయ్ తీసుకుంటారు అనుకుంటే.. కచ్చితంగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వదు. మద్దతు కోరరు కూడా…

* అధికారం కోసం.. తమిళనాడులో( Tamil Nadu ) అధికారాన్ని ఏర్పాటు చేసేటంత బలం విజయ్ వద్ద లేదు. మెజారిటీకి కూత వేటు దూరంలో ఆయన నిలిచిపోయారు. అందుకే ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో డిఎంకె కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డికి షాకింగ్ తగిలింది. ఎందుకంటే ఇప్పటివరకు విజయ్ వెనుక మొత్తం ఉన్నది జగన్మోహన్ రెడ్డి అని ఎలివేషన్ పెంచుకున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ విజయ్ కు మద్దతు ప్రకటించడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మద్దతుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాటలన్నీ గాలివేనని తేలిపోయాయి.

* ఇండియా కూటమికి దూరం..
ఇండియా కూటమికి సారథ్యం వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కేవలం ఆ కారణంతోనే ఆ కూటమికి దూరంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అటువంటిది తాను ఇష్టపడి గెలిపించుకున్న విజయ్ కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా అనేది ఒక అనుమానం. పైగా ఇప్పుడు వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు సరిహద్దులు దాటి తమిళనాడుకు చేరుతున్నాయి. టీవీకే పార్టీ శ్రేణులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడుతున్నాయి. అంత దమ్ముంటే ప్రతిపక్ష హోదాకు తగ్గ స్థానాలు కూడా తెచ్చుకునే వారు కదా అని ఎద్దేవా చేస్తున్నాయి. మరోవైపు డీఎంకే సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. మేక వన్నె పులి మాదిరిగా రంగులు మార్చుతున్నారు అంటూ వైసీపీ శ్రేణులపై డీఎంకే శ్రేణులు మండిపడుతున్నాయి. ఇలా ఎలా చూసుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version