https://oktelugu.com/

Panchayat Elections: పంచాయతీలతోపాటే మున్సిపల్‌ ఎన్నికలు.. ముహూర్తం ఎప్పుడంటే? రెడీ అవ్వండి

తెలంగాణలో పంచాయతీల కాలపరిమితి ముగిసి ఏడాది కావస్తోంది. మరోవైపు ఈనెల 26తో మున్సిపాలిటీల పదవీకాలం ముగియనుంది. దీంతో పంచాయతీ ఎన్నికలతోపాటే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 4, 2025 / 11:10 AM IST

    Panchayat Elections

    Follow us on

    Panchayat Elections: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 11 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి కుంటుపడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రిజర్వేషన్లు సవరించాలని నిర్ణయించింది. బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తర్వాత రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంది. అయితే జనవరి 26న మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు కూడా ముగియనుంది. దీంతో రాష్ట్రం ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలతోపాటే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇస్పటికే సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిపికేషన్‌ ఇచ్చి.. ఫిబ్రవరిలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. కులగణన వివరాలు ఇప్పటికే బీసీ డెడికేషన్‌ కమిషన్‌కు చేరడంతో త్వరలోనే రిప్టో ప్రభుత్వానికి ఇవ్వనుంది. దీని ప్రకారం రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్‌లో ఉండడంంతోనే ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలకు ఆ సమస్య లేదు. దీంతో పంచాయతీ ఎన్నికలతోపాటే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    నేడో రేపో గెజిట్‌..
    రాష్ట్రంలో ఇప్పటికే 141 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా 12 మున్సిపాలిటీలు, రెండు(మహబూబ్‌నగర్, మంచిర్యాల) కార్పొరేషన్లను ప్రబుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై రెండు రోజుల్లో గెజిట్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో 129 మున్సిపాలిటీల పదవీకాలం జనవరి 26న ముగుస్తుంది. మరో ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల టర్మ్‌ మే వరకు ఉంది. జీహెచ్‌ఎంసీ పదవీకాలం ఫిబ్రవరి వరకు ఉంది. ఈ ఏడాది డిసెంబర్, లేదా వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గతంలో 138 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి 5 మున్సిపాలిటీలు(పాల్వంచ, జహీరాబాద్, మణుగూరు, ఆసిఫాబాద్, మంమర్రి)కు ఎన్నికలు జరగలేదు.

    మార్పులు చేర్పులు షురూ
    ప్రభుత్వం ఇటీవల 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లతోపాటు కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధి పెంచింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేసింది. 12 మున్సిపాలిటీల్లో కోహిర్, గుమ్మడిదల, గడ్డ పోతారం, ఇస్నాపూర్‌(సంగారెడ్డి జిల్లా), చేవెళ్ల, మెయినాబాద్‌(రంగారెడ్డి జిల్లా), మద్దూర్‌(కొడంగల్‌ నియోజకవర్గం), దేవకద్ర (మహబూబ్‌నగర్‌ జిల్లా), కేసముద్రం, స్టేషన్‌ ఘన్‌పూర్‌(వరంగల్‌ జిల్లా), అశ్వారావుపేట,(కొత్తగూడెం జిల్లా) ఏదులాలాపురం(ఖమం జిల్లా) ఉఆన్నయి. వీటిలో జనాభా, ఓటర్ల ప్రకారం ఈ ప్రాసెస్‌ పూర్తి కానున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్‌ శివారులో ఉన్న 58 6గామ పంచాయతీలను సైతం శివారు మున్సిపాలిటీల్లో సర్కార్‌ విలీనం చేసింది. ఇక్కడ కూడా వార్డుల విభజన చేయనుంది. ఇవన్నీ నెల రోజుల్లో కొలిక్కి ఆరనున్నాయి. పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సమస్య ఉండదనే అభిప్రాయం కూడా ఉంది.

    త్వరలో రిజర్వేషన్లు ఖరారు..
    లోకల్‌ బాడీల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం ఇటీవలే కుల గణన చేపట్టింది. ఇందుకు సంబంధించిన డేటా ఎంట్రీ పూర్తయింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారంలోగా నివేదిక అందే అవకాశం ఉందని సమాచారం. దీని ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.