Dipadas Munshi : తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏఐసీసీ నేత దీపాదాస్ మున్షీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియామకం అయ్యారు. ఆమె నియామకం నుంచి పార్టీలో ఆమె వైఖరిపై నిత్యం చర్చ నడుస్తూనే ఉంది. ఆమె ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమె వ్యవహార శైలి పార్టీలో కలకలం రేపుతూనే ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చాక అటు పార్టీ వ్యవహారాల్లోనూ.. ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ఆమె తలదూర్చుతున్నట్లుగా పార్టీలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహార శైలిపై అధిష్టానానికి సైతం ఫిర్యాదులు వెళ్లాయి. పలువురు రాష్ట్ర నేతలు ఏఐసీసీ పెద్దలను కలిసి ఆమె వల్ల ఇక్కడ జరుగుతున్న పరిణామాలను వివరించారు.
ఇన్చార్జి అంటే తన ఊళ్లో తాను ఉంటూ.. ఇన్చార్జి బాధ్యతలు ఎక్కడైతే అప్పగించారో అక్కడి వ్యవహారాలను చక్కబెట్టాలి. సమయం దొరికినప్పుడల్లా అక్కడి వెళ్లి సందర్శిస్తూ ఉండాలి. కానీ.. మున్షీ వ్యవహారం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఎంపికైనప్పటి నుంచి ఆమె తెలంగాణలోనే ఉండిపోతున్నారు. ఇక్కడే ఉండి అన్నింటా చేతులు పెడుతున్నారని టాక్ నడుస్తోంది. ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలు, పార్టీలో పార్టీ పెద్దలతో సమాంతరంగా పాలన చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆమె కిరాయికి తీసుకున్న ఇంటి వద్ద ఆ హడావుడి చూస్తుంటే ఇదంతా అర్థం కాక మానదు. రోజూ అక్కడ కనిపించే సందడి అంతాఇంతా కాదు. ఇటు.. పార్టీ కార్యకర్తలు, అటు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు నిత్యం ఆమెను దర్శించుకుంటున్నారు.
దీపాదాస్ మున్షీ హైదరాబాద్‌లో ఓ విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నెలకు దాదాపు ఐదారు లక్షల వరకు రెంట్ చెల్లిస్తూ ఉన్నారు. అయితే.. ఈ ఇంటి వద్ద ఎప్పుడూ చూసినా లాబీయింగ్ చేస్తున్న వారి సంఖ్యనే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ జాబితాలో కొంత మంది అధికారులు కూడా ఉంటున్నారు. దాంతో ఆశావహుల నుంచి రెక్వెస్ట్‌లు పొందుతున్న మున్షీ.. వాటిని పార్టీ వ్యవహారాల్లోకి, ప్రభుత్వ వ్యవహారాల్లోకి తీసుకొస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్నికొన్ని అంశాలపై నేరుగా ఆదేశాలు ఇస్తున్నట్లుగానూ తెలుస్తోంది. అయితే.. ఈమె వ్యవహారం రోజురోజుకూ అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర అసహనం కనిపిస్తున్నట్లు సెక్రటేరియట్ వర్గాల్లోనూ టాక్ నడుస్తోంది. ఒకవేళ ఎవరైనా ఆమె వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిద్దామనుకుంటే ఎక్కడ తమపై అధిష్టానానికి నెగెటివ్‌గా రిపోర్టు పంపిస్తుందోనని భయపడుతున్నారు. మరికొందరేమో నేరుగా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది. అటు అధిష్టానం కూడా ఆమె వ్యవహారంపై అసంతృప్తితో ఉండడంతో ఆ మధ్య తొలగిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ.. అధిష్టానం వద్దకు వెళ్లి ఆమె స్పెషల్ రెక్వెస్ట్ చేశారని వినిపించింది. ఇంకొన్నాళ్ల పాటు తెలంగాణలోనే ఉంటానంటూ ఏఐసీసీ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారంట. అందుకే.. అధిష్టానం కూడా వెనక్కి తగ్గిందని టాక్. అయితే.. రాష్ట్ర నేతలు మాత్రం ఆమెను తప్పించాలంటూ ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ఈ విషయంలో అధిష్టానం నుంచి ఏ సమయంలోనైనా ఎలాంటి నిర్ణయం వచ్చినా రావొచ్చని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: The state congress leaders are serious about state congress affairs in charge deepadas munshi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com