HomeతెలంగాణBhu Bharathi: భూబాగోతాలకు చెక్.. అక్రమాలు చేస్తే ఇక అంతే.. రేవంత్ రెడ్డి బ్రహ్మస్త్రం

Bhu Bharathi: భూబాగోతాలకు చెక్.. అక్రమాలు చేస్తే ఇక అంతే.. రేవంత్ రెడ్డి బ్రహ్మస్త్రం

Bhu Bharathi: భూ సమస్యల పరిష్కారం, భూముల పరిరక్షణ కోసం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తీసుకువచ్చింది. ఈ పోర్టల్‌ ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే ధరణి కారణంగా చాలా మంది భూముల నమోదులో పొరపాట్లు జరిగాయి. ఎక్కువ తక్కువ భూములు నమోదయ్యాయి. సాగులో లేని భూములను కూడా సాగు భూములుగా చూపించారు. దీంతో రైతులు అధికారుల చుట్టూ ఏళ్లుగా తిరుగుతున్నారు. సీసీఎల్‌ఏ కొన్ని సమస్యలు పరిష్కరించినా.. ఇప్పటికీ కలెక్టర్ల వద్ద వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక చాలా ప్రభుత్వ భూములు నాయకుల పేరిట పట్టాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో భూ అక్రమాలకు చెక్‌ పెట్టేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా భూ భారతి చట్టం అమలు చేయాలని నిర్ణయించింది. ఇటీవలే అసెంబ్లీ, శాసన మండలిలో బిల్లు ఆమోదం పొందింది. గవర్నర్‌ ఆమోదం కోసం ప్రభుత్వం పంపించింది. గవర్నర్‌ ఆమోదించగానే చట్టంగా మారుతుంది. అయితే కొందరు అధికారుల తీరుతో భూ రికార్డుల్లో తప్పులు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. లంచాలకు ఆశపడి, ప్రభుత్వ పెద్దల మాటలు విని, బెదిరింపులకు భయపడి ఇతర కారణాలతో కొందరు అధికారులు రికార్డులు మారుస్తున్నారు. ఈ క్రమంలో భూ వివాదాలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టంతో భూ సమస్యలకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది.

తప్పుగా నమోదు చేస్తే క్రిమినల్‌ చర్యలు..
భూ భారతి చట్టాని రాష్ట్ర రెవెన్యూ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. అయినా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. భూముల వివరాలు తప్పుగా నమోదు చేసే అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేలా చట్టంలో నిబంధన పొందుపరిచారు. ఏ అధికారి స్థాయిలో తప్పు జరిగితే ఆ అధికారిపైనే చర్యలు తీసుకునేలా చట్టం ఉంది. అవసరమైతే ఆ అధికారిని ఉద్యోగం నుంచి తొలగించేలా నిబంధన చేర్చారు. ఇందుకు ఐఏఎస్‌ ఆఫీసర్లు కూడా అతీతులు కాదని సెక్రటేరియేట్‌ వర్గాలు తెలిపాయి.

గ్రామానికో అధికారి..
ఇక భూ సమస్యలను చాలా వరకు గ్రామస్థాయిలోనే పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామాల్లో వీఆర్వోల స్థానంలో జే ఆర్వోలను నియమించాలని నిర్ణయించింది. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ఒక జేఆర్వో ఉంటారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా జేఆర్వో వ్యవస్థను తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా4 11 వేల మందిని నియమించేలా కసరత్తు చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version