Medaram Earthquake : మేడారం కేంద్రంగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. భూ ప్రకంపనల వల్ల పెద్దగా నష్టం చోటు చేసుకోకపోయినప్పటికీ శాస్త్రవేత్తలు అధ్యయనంలో సరికొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.. భూమికి ఐదు నుంచి 40 కిలోమీటర్ల లోతులో తక్కువ వ్యవధిలో భూ ప్రకంపనలు రావడంతో భూకంపం తీవ్రత స్వల్పంగా ఉందట. ఒకవేళ ఇది గనుక భూమికి 10 కిలోమీటర్ల లోతులో గనుక వచ్చి ఉంటే ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండేదట. 35 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఉపరితలం పైన స్వల్పంగానే ప్రకంపనలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు?
తెలంగాణలో మేడారం కేంద్రంగా బుధవారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం సంచలనం కలిగించింది. అయితే ఇక్కడ మాత్రమే ఎందుకు భూ ప్రకంపనలు వచ్చాయనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. భూమి అనేది అనేక పొరలతో నిర్మితమై ఉంటుంది. ఈ పొరలు కదిలినప్పుడు మాత్రమే భూ ప్రకంపనలు చోటుచేసుకుంటాయి. జియాలాజికల్ సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం భూమి ఉపరితలం కింద ఒక స్థానం ఉంటుంది. దానిని భూకంప కేంద్రం అంటారు. భూకంపం తీవ్రంగా వస్తే.. దాని ప్రభావం చాలా దూరం వరకు ఉంటుంది. ఉదాహరణకు 0.5 నుంచి 5.9 వరకు రిక్టర్ స్కేల్ పై నమోదైతే దానిని జియోలాజికల్ పరిభాషలో స్వల్ప భూకంపం అంటారు.. అప్పుడు భూమి కంపించిన తీరుకు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కింద పడిపోతుంది. ఒకవేళ అది 7 నుంచి 7.9 గా నమోదైతే భవనాలు నిట్ట నిలువునా కూలిపోతాయి. దారుణమైన పరిస్థితులు సంభవిస్తాయి.
తెలంగాణలో ఎలా ఏర్పడిందంటే..
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో మేడారం కేంద్రంగా బుధవారం ఏర్పడిన భూకంపం తీవ్రత 05.0 మాత్రమే. ఇది కూడా కొన్ని సెకన్ల వ్యవధిలోనే భూమి కంపించింది. స్థాయిలో భూకంపం 1969 లో ప్రసిద్ధ రామక్షేత్రం భద్రాచలంలో చోటుచేసుకుంది. ఇన్ని సంవత్సరాల అనంతరం భూకంపం రావడం ఇదే తొలిసారి.. అయితే మేడారం కేంద్రంగా భూకంపం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నది ప్రవహించే చోట భూ ప్రకంపనలు వస్తాయి. ఎందుకంటే నది ప్రవాహం దాటికి భూమి లోపల పగులు ఏర్పడుతుంటాయట. అందువల్ల లోపలి పొరల్లో సర్దుబాటు జరుగుతుందట.. మేడారం ప్రాంతంలో భూకంపం రావడానికి కారణం ఇదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే నదీ పరివాహక ప్రాంతాలు, బొగ్గు గనులు ఉండే ప్రాంతాలలో భూకంపం రావడానికి అవకాశం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. అయితే భూపాలపల్లి జిల్లా పరిధిలో బొగ్గు తవ్వకాలు విపరీతంగా జరుగుతున్నాయి. ములుగు లోను మట్టి తవ్వకాలు విస్తారంగా జరుగుతున్నాయి. అందువల్లే భూమి పొరల్లో సర్దుబాట్లు జరుగుతున్నాయి. బుధవారం అలాంటి సర్దుబాట్ల వల్లనే భూకంప తరంగాలు వేగంగా వ్యాపించాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.. ఇక భూ ప్రకంపనలను సిస్మోగ్రాఫ్ అనే యంత్రం ద్వారా నమోదు చేస్తారు. దేశంలో నాలుగు సిస్మోక్ జోన్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ జోన్ -2 లో ఉంది. అయితే ఈ ప్రాంతంలో అత్యల్పంగానే భూకంపాలు వస్తాయట. మనదేశంలో సిస్మోక్ జోన్లు(జోన్ లు 11, 111, 1V) ఉన్నాయి.