https://oktelugu.com/

Bhupalpally: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన మరో ఆణిముత్యం.. అటు ఇటైతే అంతే!

మానేరు వాగుపై టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట వద్ద ఈ వంతెన నిర్మించారు. అయితే నాణ్యత లోపం కారణంగా వంతెన ప్రారంభించిన కొన్ని రోజులకే ఓ పిల్లర్‌ కుంగి స్లాబ్‌ పడిపోయింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 1, 2024 / 06:13 PM IST

    Bhupalpally

    Follow us on

    Bhupalpally: బీఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణకు తాము ఏం తక్కువ చేశాం అని అంటుంటారు. దళితులకు ఇది చేశాం. బీసీలకు అది చేశాం. రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం. వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నాం.. అంటూ ఊదరగొడతారు. కానీ, వారు చేసిన అభివృద్ధిలో నాణ్యత ఎంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల డ్యామేజీలతో తెలంగాణ సమాజానికి అర్థమైంది. అయితే ఇవి వెలుగులోకి వచ్చాయి కాబటి తెలుస్తోంది. కరీంనగర్‌లో నిర్మించిన తీగల వంతెన పరిస్థితి ఇంతే. ఇంకా వెలుగులోకి రాని అనేక నిర్మాణాలు ఉన్నాయి. అందులో భూపాలపల్లి జిల్లా టేకు మట్లలో మానేరు వాగుపై నిర్మించిన వంతెన కూడా ఒకటి.

    కుంగిన పిల్లర్‌..
    మానేరు వాగుపై టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేట వద్ద ఈ వంతెన నిర్మించారు. అయితే నాణ్యత లోపం కారణంగా వంతెన ప్రారంభించిన కొన్ని రోజులకే ఓ పిల్లర్‌ కుంగి స్లాబ్‌ పడిపోయింది. దీంతో వంతెన కూడా కుంగిపోయింది. కాంట్రాక్టర్, స్థానికులు రాకపోకల కోసం కూలిన స్లాబ్‌ మధ్యలో ఒక ఇనుప వంతెన ఏర్పాటు చేశారు.

    ఇరుకు వంతెనమీదుగా రాకపోకలు..
    ఇక మానేరుపై నిర్మించిన వంతెన కుంగడంతో నాటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రయాణికులకు ఆటంకం కలుగకుండా ఓ ఇనుప వంతెన ఏర్పాటు చేయించారు. ప్రమాదకరంగా ఉన్న ఈ వంతెన మీదుగానే ద్విచక్రవాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు.

    పట్టు తప్పితే అంతే..
    ఈ ఇనుప వంతెనపై రాకపోకలు సాగించే సమయంలో ఏమాత్రం పట్టు తప్పినా వాగులో పడిపోవాల్సిందే. తెలంగాణ వర్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మందు తాగుడు ఎక్కువైంది చీకటి పడితే అంతా తాగుడు ఊగుడే. ఈ సమయంలో వాహనదారులు మందు తాగి వాహనాలు నడిపుతూ మాత్రం పట్ట తప్పినా ప్రమాదం ఖాయం. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మేడిగడ్డ తర్వాత నిర్మించిన మరో ఆణిముత్యంలాంటి బ్రిడ్జి ఇదే అని స్థానికులు అంటున్నారు. బ్రిడ్జి కూలింది కాబట్టే ప్రభుత్వాని కూల్చామని కొందరు చెబుతున్నారు.