CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర కోడ్ టీఎస్‌ను తొలగించి దానిస్థానంలో టీజీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం దానిని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వాహనాల రిజి6స్టేషన్ నంబర్ ప్లేట్లు మార్చే ఉద్యమం చేపట్టారు. ఈ క్రమంలో ఏపీని తొలగించి టీజీ పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో ఉద్యమకారులు అదే చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక టీజీ స్థానంలో కేసీఆర్ టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ కోడ్ ఎంచుకున్నారు. మార్పుపై ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఎందుకు మార్చారని కూడా అడగలేదు. దీంతో టీఎస్ పేరుతో వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి.
సెంటిమెంట్ వర్కవుట్..
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు గుర్తింపు ఉంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారింది. దీంతో తెలంగాణ సెంటిమెంట్‌ను కాంగ్రెస్ వర్కవుట్ చేయాలని భావిస్తోంది. కేసీఆర్ చేసిన అన్యాయం, తెలంగాణ భావోద్వేగం పెరిగేలా రేవంత్‌రెడ్డి వేసిన ఎత్తులు ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారాయి. పార్టీని అధికారంలోకి తెచ్చాయి.
ఆ రెండు అమలు..
తాము అధికారంలోకి రాగానే ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటిస్తామని.. టీఆర్‌ఎస్‌ను పోలిన వాహనాట రిజిస్ట్రేషన్ కోసం తెచ్చిన టీఎస్ స్థానంలో టీజీ తెస్తామని ప్రకటించారు. రేవంత్ ప్రతిపాదనకు తెలంగాణ వాదులు మద్దతు తెలిపారు. దీంతో ఆ రెండు హామీలు నెరవేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ 2న జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక టీఎస్ కోడ్‌ను టీజీగా మార్చే అంశంపైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఈమేరకు ఆదివారం కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.