Andesri passes away: అందెశ్రీ అకస్మాత్తుగా చనిపోవడం యావత్ తెలంగాణ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెడితే ఉద్యమకారుల వరకు కన్నీరు పెడుతున్నారు.. ఈ దారుణమైన పరిణామాన్ని తట్టుకోలేక నిర్వేదంలో మునిగిపోయారు. వాస్తవానికి అందెశ్రీ చనిపోవడం నిజంగా ఒక షాకింగ్ లాంటి వార్త. ఆరోగ్యంగా ఉన్న అందెశ్రీ.. ఉన్నట్టుండి ఎందుకు కుప్పకూలిపోయారు.. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఎందుకు చనిపోయారు? ఇప్పుడు ఈ ప్రశ్నలే సగటు తెలంగాణ వాదిని తొలుస్తున్నాయి.
గాంధీ హాస్పిటల్ హెచ్వోడి సునీల్ కుమార్ అందెశ్రీ మృతికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.. అందెశ్రీ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాలని ఆయన పేర్కొన్నారు. అందెశ్రీ గడిచిన ఐదు సంవత్సరాలుగా హైపర్ టెన్షన్ తో ఇబ్బంది పడుతున్నారు.. ఒక నెల నుంచి ఆయన మందులు సరిగ్గా వాడడం లేదు. మందులు సరిగ్గా వాడకపోవడం వల్ల ఆయాసంతో ఇబ్బంది పడుతున్నారు.. చాతి భాగంలో కూడా ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో అందెశ్రీ నిర్లక్ష్యాన్ని కొనసాగించడం వల్లే చనిపోయారని సునీల్ కుమార్ పేర్కొన్నారు..
ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అందెశ్రీ మామూలుగానే పడుకున్నారు.. ఉదయం లేచి చూసేసరికి బాత్రూం వద్ద కింద పడిపోయారు.. అయితే ఆ రాత్రి ఏం జరిగిందనేది కుటుంబ సభ్యులకు తెలియదు.. సోమవారం తెల్లవారుజామున 6 గంటల 20 నిమిషాల ప్రాంతంలో కుటుంబ సభ్యులు అందశ్రిని కుటుంబ సభ్యులు గమనించారు.. వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు.. అందెశ్రీని పరీక్షించిన గాంధీ ఆసుపత్రి ఆర్ ఎం వో చనిపోయాడని నిర్ధారించారు.. అయితే ఆయన చనిపోయి అప్పటికే ఐదు గంటలు కావచ్చని గాంధీ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు..
తనకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా వైద్యులను సంప్రదించకుండా అందెశ్రీ నిర్లక్ష్యం చేశారని.. గత నెల రోజులుగా ఆయన బీపీ మాత్రలు వేసుకోవడం లేదని వైద్యులు పేర్కొన్నారు.. వ్యక్తిగత ఆరోగ్యాన్ని అందెశ్రీ పరిరక్షించుకుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదని గాంధీ ఆసుపత్రి వైద్యులు వివరించారు.. ఆయన ప్రతిరోజు నడకకు వెళ్లేవారని.. ఇదే క్రమంలో బీపీ మాత్రలు వేసుకొని ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదని వైద్యులు పేర్కొంటున్నారు.. బీపీ మాత్రలు వేసుకోకపోవడం వల్ల హఠాత్తుగా గుండెపోటు వచ్చి ఉంటుందని.. అందువల్లే అందెశ్రీ చనిపోయారని వైద్యులు చెబుతున్నారు. హైపర్ టెన్షన్ ఉన్న వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి.. మందులు వాడే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సరే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.