Telangana Police: ఎందుకంటే దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ గా నిలిచారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ముఖ్యంగా పోలీసులపై భారత రాష్ట్ర సమితి నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పోలీసులు ప్రభుత్వానికి, ప్రజలకు కాకుండా కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా మారిపోయారని ఆరోపిస్తున్నారు.. అయితే భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న ఆరోపణలకు సరైన కౌంటర్ ఇవ్వడంలో విఫలమైన కాంగ్రెస్ నాయకులకు.. ఇప్పుడు బలమైన ఆయుధం లభించింది. ఎందుకంటే దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ గా నిలిచారు.. ఇండియా జస్టిస్ రిపోర్ట్ -2025 నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.. ఆ నివేదిక ప్రకారం తెలంగాణ పోలీసులు న్యాయ వ్యవస్థలో రెండవ స్థానం, న్యాయ సంబంధిత సేవలలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచారు. న్యాయ సహాయం, జైళ్ల నిర్వహణను కలిపి చూస్తే జాతీయ స్థాయిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. కెపాసిటీ, పోలీసింగ్ వంటి అంశాలలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 2, 3 స్థానంలో నిలిచాయి. మొత్తంగా చూసుకుంటే న్యాయవ్యవస్థలు, పోలీసు వంటి విభాగాలలో దక్షిణాది రాష్ట్రాలు మిగతా ప్రాంతాల కంటే మెరుగ్గా ఉన్నాయి.. ఈ జాబితాలో కర్ణాటక ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలున్నాయి. న్యాయ సహాయం, పోలీసు, న్యాయ వ్యవస్థ, జైళ్ల నిర్వహణ ఈ నాలుగు అంశాల ఆధారంగా దేశంలోనే పెద్ద, మధ్యస్థాయిలో రాష్ట్రాలను అధ్యయనం చేశారు. అనే ఆధారంగా నివేదిక రూపొందించారు. పది పాయింట్లు మార్కులుగా కేటాయించగా కేటాయించగా 6.78 స్కోర్ తో కర్ణాటక తొలి స్థానంలో గెలిచింది. 3.63 స్కోర్ తో పశ్చిమ బెంగాల్ చివరి స్థానంలో ఉంది పశ్చిమ బెంగాల్ కంటే జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ కాస్త ముందు స్థానంలో ఉన్నాయి. అయితే గత ఏడాది తెలంగాణ 11వ స్థానంలో ఉండగా.. ఈసారి మూడో స్థానానికి వచ్చింది. ఇక ఐదవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్.. రెండవ స్థానానికి చేరుకుంది..
Also Read: తెలంగాణలో ‘కొత్త’ దుమారం.. ఎమ్మెల్యేల కొనుగోలుకు సుపారీ
సంచలన విషయాలు
మనదేశంలో ప్రతి లక్ష జనాభాకు సంఘటన 197.5 మంది పోలీసులు ఉండాలి. మనదేశంలో కేవలం 155 మంది మాత్రమే ఉన్నారు. బీహార్ రాష్ట్రంలో లక్ష జనాభా కు 81 పోలీసులు మాత్రమే ఉన్నారు. దీంతో ఈ రాష్ట్రం చివరి స్థానంలో ఉంది. అయితే గతంతో పోల్చి చూస్తే బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది.. కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు గత మూడేళ్ల వ్యవధిలో న్యాయవ్యవస్థపరంగా ఉత్తమ ఫలితాలు సాధించాయి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు జైళ్ల నిర్వహణలో ముందు వరుసలో ఉన్నాయి. ఇక జైళ్లకు వస్తున్న ఖైదీల సంఖ్య గతంతో పోల్చి చూస్తే 50% పెరిగింది. అయితే వీరిలో అదే విధంగా అండర్ ట్రయల్స్ కావడం విశేషం.. తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలలో 51,974 మందికి, గ్రామాలలో 50,373 మందికి ఒక పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ సిబ్బందిలో 8.7%, జైలు సిబ్బందిలో 6.6 శాతం మంది మహిళలు ఉన్నారు. కింది కోర్టులలో మహిళ న్యాయమూర్తులు 55.3%, హైకోర్టులలో 33.3 శాతమంది ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 20 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు 17.7%, పది నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్న కేసులు 32.6 శాతం ఉన్నాయి.
Also Read: అమరావతి 2.0కు ముహూర్తం ఫిక్స్!