Telangana elections : తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 22 నెలలు అయింది. అయితే గత బీఆర్‌ఎస్ పాలనతో పోలిస్తే.. కాంగ్రెస్ పాలనలో కొత్తదనం కనిపించడం లేదు. హామీలు చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కూడా అధికార కాంగ్రెస్ భయపడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్ చూస్తోంది. గెలిచి కాంగ్రెస్‌పై వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. తమ ఖాతాలో వేసుకోవాలని కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజల నాడి భిన్నందగా ఉంది,
వేడెక్కుతున్న రాజకీయాలు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ప్రజాభిప్రాయం ప్రకారం తెలంగాణలో ఇప్పుడే ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్ పార్టీ సుమారు 85 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంచనాలు ముఖ్యంగా పట్టణాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ కనిపిస్తున్న మూడ్‌ను ప్రతిబింబిస్తున్నాయి.
కానరాని అభివవృద్ధి..
జూబ్లీహిల్స్ వంటి ప్రాధాన్య ప్రాంతాల్లోని ఓటర్లు స్పష్టంగా చెబుతున్నది ‘‘కేసీఆర్ పాలనలో కనిపించిన అభివృద్ధి స్థాయిలను ప్రస్తుత ప్రభుత్వం చేరుకోలేకపోతోంది.’’ రోడ్ల విస్తరణ, కాలువ వ్యవస్థ, స్మార్ట్‌లైటింగ్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పని దిశలో స్థానికంగా మాగంటి గోపీనాథ్ పేరు వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌పై నిరుత్సాహం పెరుగుతోందని పౌరులు పేర్కొంటున్నారు.
పాలనలో తేడాలు..
ప్రజల అభిప్రాయాల ప్రకారం కేసీఆర్ పాలన పద్ధతి స్థిరత్వం, ప్రణాళికాబద్ధతకు కేరాఫ్‌గా ఉండగా, రేవంత్ వైఖరి ఎక్కువగా ప్రతిస్పందనాత్మకంగా, ప్రచారాధారితమైందని భావిస్తున్నారు. పథకాల నిరంతరత, బహుళ కార్యక్రమాల రూపకల్పన, శక్తివంతమైన బ్యూరోక్రసీ నియంత్రణ వంటి అంశాలలో కేసీఆర్ రికార్డు గుర్తు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు ఉన్నప్పటికీ, నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ జోరు..
2023లో కేసీఆర్ ఇచ్చిన హామీలను మించి అమలుచేస్తామని పార్టీ వర్గాలు ప్రకటించడం గ్రామీణ ప్రజల్లో విశ్వాసం కలిగించింది. రైతు బంధు, దళిత బంధు, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు ఇంకా గుర్తుండే స్థాయిలో ఉన్నాయి. ఇక కాంగ్రెస్ 2023 ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ పాలను మించి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్‌ను విశ్వసించారు. హైదరాబాద్‌లో ‘‘వాగ్దానాలు కంటే వాస్తవ పనులు ముఖ్య’’ అన్న భావన బలంగా వినిపిస్తోంది.
జూబ్లీహిల్స్‌లో ఇలా..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ కేంద్రం, పట్టణ అభివృద్ధికి బీఆర్‌ఎస్ చేసిన కృషితో ప్రత్యేక ప్రాధాన్యం పొందింది. మాగంటి గోపీనాథ్ రాజకీయ మైదానంలో పునరుద్ధరణకు ప్రజల విశ్వాసం ఒక బలమైన సంకేతమని స్థానిక విశ్లేషకులు గుర్తిస్తున్నారు. అదే సమయంలో, రేవంత్ రెడ్డి ప్రాధాన్యం గల నిర్ణయాలు హైదరాబాద్ మధ్యతరగతి వర్గంపై ప్రభావం చూపలేదని భావిస్తారు.
ప్రస్తుత సామాజిక–రాజకీయ పరిస్థితులు చూస్తే, పట్టణ–గ్రామీణ రెండు స్థాయిల్లో కూడా కేసీఆర్ నాయకత్వంపై ఒక నోస్టాల్జియా కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. రాబోయే నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల అంచనాలను అనుసరించి పనిచేయగల సామర్థ్యం ఉంటేనే ఆ ప్రభావాన్ని తగ్గించగలదని నిపుణుల అంచనా.
ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే కేసీఆర్ పార్టీకి 85 సీట్లు వస్తాయి
కేసీఆర్ చేసిన అభివృద్ధిలో హాఫ్ ఇంచ్ కూడా రేవంత్ రెడ్డి చేయలేదు
జూబ్లీహిల్స్‌లో కేసీఆర్, మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధిని చూసి ఓటేస్తారు
Video Credits – eha Telangana Talks pic.twitter.com/4EddpzowIu
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2025