Rythu Bharosa: పంటలు సాగుచేసేవారికే రైతు భరోసా..!

గత యాసంగి పంట కాలం వరకు రూ.6 వేల చొప్పన చెల్లింది. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుభరోసా పేరుతో రెండు పంటలకు కలిపి రూ.15 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది.

Written By: Raj Shekar, Updated On : June 15, 2024 1:53 pm

Rythu Bharosa

Follow us on

Rythu Bharosa: తెలంగాణలో ఖరీఫ పంటల సాగు మొదలైంది. అడపదడపా కురుస్తున్న వర్షాతో రైతుల సాగుబాట పట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు కసరత్తు చేస్తోంది. అయితే భూమి ఉన్న రైతుందరికీ రైతబంధు పథకం ద్వారా పెట్టబడి సాయం అందించింది. ఎకరాకు రూ.5 వేలతో ప్రారంభించి.. గత యాసంగి పంట కాలం వరకు రూ.6 వేల చొప్పన చెల్లింది. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుభరోసా పేరుతో రెండు పంటలకు కలిపి రూ.15 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది.

సాగుచేసే వారికే..
ఇక రైతుభరోసాను గత ప్రభుత్వలా అందిరికీ కాకుండా వ్యవసాం చేసే రైతులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు కసరత్తు చేస్తోంది, ప్రభుత్వ ఉద్యోగలు, ఇన్‌కమ్‌ ట్యాక్‌ చెల్లించేవారు, ఎంపీలు, ఎమ్మెల్యేతోపాటు ప్రజాప్రతినిధలకు కూడా రైతు భరోసా ఇవ్వొద్దని నిర్ణయించింది. ఈమేరకు అర్హుల జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వ్యవసాయ భూమి ఉన్నా పంటలు సాగు చేయకుండా కౌలుకు ఇచ్చే యజమానులకు రైతుభరోసా ఇవ్వకూడాదని నిర్ణయించింది. ఈమేరకు త్వరలో రైతు సంఘాలు, ప్రజా ప్రతినిధులతో చర్చించి దుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

రైతుబీమా కూడా..
ఇక రైతు బీమా పథకాన్ని కూడా పంటుల సాగుచేసేవారికే వర్తింపజేయాలని భావిస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్‌ బీమా యోజనను 2020 నుంచి రాష్ట్రంలో అమలు చయడం లేదు. దీంతో రేవంత్‌ సర్కార్‌. తాజాగా రైతు బీమా అమలు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు కేంద్రానికి ప్రతిపాదన పంపించగా అందుకు కేంద్రం అంగీకరించింది. పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పంట రుణాల మాఫీ,,
ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈమేరకు పంట రుణాల మాఫీకి సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అయితే రుణమాఫీ కూడా అందరు రైతులకు కాకుండా వ్యవసాయం చేసేవారికే వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల రుణాలు మాఫీ చేయొద్దని నిర్ణయింది. ఆగస్టు 15 వరకు రుణ మాఫీ చేస్తామని రేవంత్‌ ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు.