HomeతెలంగాణTelangana Elections 2023: తెలంగాణలో బిజెపితో రిస్కే!

Telangana Elections 2023: తెలంగాణలో బిజెపితో రిస్కే!

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. గురువారం పోలింగ్ జరగనుంది. గెలుపు పై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ ఎన్నికల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. దీంతో ఓటరు నాడీ పట్టుకోవడం కష్టతరంగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పోటీ ఉండగా.. పట్టణ, నగర ప్రాంతాల్లో బిజెపి సైతం గట్టి పోటీ ఇస్తోంది. దీంతో గెలుపోటముల అంచనా వేయడానికి వీలు లేకుండా పోతుంది.

అయితే ఇప్పుడు బిజెపి ఆ రెండు పార్టీలకు ధీటుగా మారింది. తాను గెలవకపోయినా.. ప్రత్యర్థి పార్టీల గెలుపోవటములను నిర్దేశించే స్థాయికి చేరుకోవడం విశేషం. ఒకానొక దశలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని విశ్లేషణలు సైతం ప్రారంభమయ్యాయి. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. భారతీయ జనతా పార్టీ వెనుకబడిపోయింది. కానీ ఎన్నికల పోలింగ్ సమీపించేసరికి బిజెపి దూకుడు కనబరిచింది. ప్రచారంలో హోరెత్తించింది. ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో కలవరానికి కారణమైంది. బిజెపి తమ ఓట్లను ఎక్కడ చీల్చుతుందోనన్న బెంగ ఆ రెండు పార్టీలను వెంటాడుతోంది.

తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ట్రయాంగిల్ ఫైట్ లో పదివేల మెజారిటీ లోపు ఓట్లతోనే గెలుపొందే నియోజకవర్గాలు 70 వరకు ఉన్నాయి. 5000 ఓట్లు లోపు మెజారిటీతో గెలిచే నియోజకవర్గాలు 50 వరకు ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఎన్ని? చీల్చే ఓట్లు ఎన్ని? అన్నదానిపై మిగతా రెండు పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. అదే సమయంలో పట్టణాలు, నగరాల్లో బిజెపి బలమైన శక్తిగా ఉంది. అక్కడ కాంగ్రెస్, బీ ఆర్ఎస్ కు లభించే ఓట్లు బట్టి.. బిజెపి విజయం ఆధారపడి ఉంది. ఇలా ఎలా చూసుకున్నా తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఆ పార్టీ మిగతా పార్టీలకు ప్రమాదకారిగా మారింది.

గత ఎన్నికల్లో బిజెపి ఒక స్థానాన్ని మాత్రమే గెలిచింది. తరువాత సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుపొందింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సొంతం చేసుకుంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. కొన్ని నిర్ణయాలతో బిజెపి వెనుకబడింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన జోష్ నెలకొంది. తెలంగాణ ప్రజల్లో సైతం చేంజ్ కనిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి నిర్ణయాత్మక శక్తిగా మారింది. ఆ రెండు పార్టీలతో పోల్చుకుంటే సీట్ల పరంగా మెజారిటీ దక్కకపోయినా.. ఓట్ల పరంగా ఆ రెండింటికి ముచ్చెమటలు పట్టించడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular