
TSPSC Paper Leak Renuka: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్న పత్రం లీకేజీ కి సంబంధించి గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక వేసిన ప్లాన్ సిట్ అధికారుల మైండ్ బ్లాంక్ చేస్తోంది.. ఈ పేపర్ లీకేజీ వ్యవహారం లో ముందస్తు ప్లాన్ ప్రకారమే రేణుక రంగంలోకి దిగింది. ప్రవీణ్ కు వలపు వల విసిరింది. అతడికి స్వర్గ సుఖాలను అందించింది. కేవలం డబ్బు కోసం అడ్డదారులు తొక్కింది.. ఇందుకోసం ప్రవీణ్ అనే ఉద్యోగితో పేపర్ లీకేజ్ కి ఉసిగొలిపింది. రేణుక భర్త ఢాక్యా నాయక్ టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఆమె తల్లి లక్ష్మీబాయి మన్సూర్ పల్లి భారత రాష్ట్ర సమితి సర్పంచ్ గా పనిచేస్తుంది.. గురుకుల ఉపాధ్యాయురాలుగా తనకు, టెక్నికల్ అసిస్టెంట్ గా తన భర్త ఢాక్యా నాయక్ కు ఉన్నత స్థాయి అధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించి ఆమె లీకేజ్ కి పూనుకొన్నట్టు చర్చ సాగుతోంది.
ఢాక్యా నాయక్, రేణుక దంపతులకు ఇటు రాజకీయంగా, అటు అధికార వర్గాల్లో సంబంధాలు ఉండటంతో వారిని నమ్మి ఈ అభ్యర్థులు ఒక్కొక్కరు లక్షల్లో ముట్ట చెప్పినట్టు తెలుస్తోంది. పైగా పరీక్ష జరిగే తేదీలలో రేణుక దంపతులు నీలేష్ నాయక్, గోపాల్ నాయక్ ను తమ కారులో తీసుకొచ్చి ఇంటి వద్ద ఉంచుకున్నారు. పరీక్షకు కూడా వారి కారులోనే తీసుకెళ్లారు. పరీక్ష అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. ఇక్కడ వారితో డబ్బు వ్యవహారంలో జరిగిన గొడవ వల్లే ప్రశ్న పత్రం లీకేజీ బయటపడింది. అయితే ఈ ప్రశ్న పత్రం లీకేజీ కి సంబంధించి తన తల్లి, భర్తతో రేణుక పలుమార్లు చర్చించిందని తెలుస్తోంది. మరోవైపు ప్రవీణ్ తో సంబంధం పెట్టుకోవాలని, అలా అయితేనే పనులు జరుగుతాయని భర్త, రేణుకను ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. ఇక వారి వద్ద నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రతి శనివారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లే రేణుక.. సోమవారం ఉదయం సొంత గ్రామానికి వచ్చేది. ప్రవీణ్ తో రోజూ గంటలకొద్దీ మాట్లాడేది.. తనకు పెళ్లి కాలేదని నమ్మించేందుకు పుస్తెలు, కాలిమెట్టలు కూడా తొలగించింది. ప్రవీణ్ ను ఆకర్షించేందుకు బ్యూటీ పార్లర్ వెళ్లి ఫేషియల్ చేయించుకునేది.. అతనితో మాట్లాడుతున్నప్పుడు వేరే సిమ్ ఉపయోగించేది.. ఈ వ్యవహారంలో తల్లి భర్త కాపాడుతారు అనుకున్నది కానీ.. చివరికి తానే కటకటాల పాలయింది.

ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు తెలియగానే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లోకి వచ్చే సిబ్బంది వివరాలను అధికారులు సేకరించారు. కంప్యూటర్లు, లాన్ ఉన్న గదిలోకి ప్రవీణ్ కుమార్ వచ్చినట్టు గుర్తించారు. కాన్ఫిడెన్షియల్ భాగంలో ఉండే ప్రశ్న పత్రాలకు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపేవాడని, రహస్య వివరాలపై చర్చించాడని ఓ ఉద్యోగి చెప్పాడు. దీంతో అతనిపైనే అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అధికారులు పేర్కొన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రవీణ్ ఫోన్లో చాలామంది మహిళల ఫోన్ నెంబర్లు ఉన్నాయని, 42 మంది మహిళల వద్ద అర్ద నగ్న,నగ్న ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు సమాచారం.. ఇవి నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాడా, వారితో ఉన్నప్పుడు వీడియో తీశాడా అనేది ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా నిర్ధారణ అవుతుందని పోలీసులు చెబుతున్నారు.