Ponguleti Srinivasa Reddy Son: అధికారంలో ఉన్న నాయకులు కబ్జాలను బెదిరింపులను తమకు ఆస్తిగా భావిస్తున్నారు ప్రజలు ఇచ్చిన పేటెంట్ రైట్ అని చెప్పుకుంటున్నారు. అధికారం అండ చూసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నేతల పుత్ర రత్నాలు కూడా అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారు. బెదిరింపులు, దౌర్జన్యాల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తెలంగాణలో రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డి నిత్యం వివాదాల్లో ఉంటున్నారు. ఆ మధ్య సింగపూర్ ప్రాంతం నుంచి నిషేధిత వస్తువులను దిగుమతి చేసుకున్నారని ఆరోపణలు వినిపించాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయడంతో అప్పట్లో కలకలం నెలకొంది. ఇప్పటికి ఈ కేసు కు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారుల పిలుపుమేరకు మంత్రి కుమారుడు విచారణకు ఒకసారి హాజరయ్యారు..
ఇప్పుడు ఓ భూమి వాదంలో మంత్రి కుమారుడు హర్షారెడ్డి చిక్కుకున్నారు.. గులాబీ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా ఈ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చింది. సంచలన ఆధారాలతో ప్రభుత్వానికి దిమ్మ తిరిగే విధంగా వార్తలను ప్రసారం చేసింది.. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ దొరుకుతారా అని చూస్తున్న గులాబీ మీడియా.. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యవహారాలను బయటపెడుతోంది. తాజాగా పొంగులేటి కుమారుడు హర్షా రెడ్డి సాగించిన వ్యవహారాన్ని కూడా గులాబీ అనుకూల మీడియా బయటపెట్టింది.
వాస్తవానికి ఈ వ్యవహారాన్ని రాజకీయ ఆరోపణగా చాలామంది చూశారు. రాజకీయ దురుద్దేశంతోనే గులాబీ పార్టీ మీడియా ఈ వార్తలను ప్రసారం చేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ స్వయంగా మంత్రి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడంతో గులాబీ పార్టీ మీడియా చేసినవి ఆరోపణలు కావు.. నిజాలని తేరింది.
300 కోట్ల భూమిని కబ్జా చేయడానికి మంత్రి కుమారుడు జెసిబి లతో దాడి చేయించాడని గులాబీ పార్టీ అనుకూల మీడియా ఆరోపించింది.. గండిపేట పరిధిలోని వట్టి నాగులపల్లి లో భూకబ్జాకు మంత్రి కుమారుడు ప్రయత్నించాడని.. 70 మందికి పైగా బౌన్సర్లతో భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేశారని.. అడ్డుకున్న భూమి యజమానిపై దాడి చేశారని.. ఏడు సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారని.. పల్లవి షా అనే మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారని గులాబీ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ భూమిలో ఉన్న గోశాలను సైతం ధ్వంసం చేశారని పల్లవి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది.
గచ్చిబౌలి పోలీసులు రాఘవ కన్స్ట్రక్షన్, మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు గులాబీ మీడియాలో వార్తలు వచ్చాయి. నవంబర్ 30న అర్ధరాత్రి పూట ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై మొదట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తర్జనభర్జనపడ్డారు. చివరికి ఈ వ్యవహారంపై మంత్రి ఓపెన్ అయ్యారు.. తన కొడుకు మీద కేసు నమోదు అయినట్టు ప్రకటించారు. ప్రజా పరిపాలనలో పారదర్శకత అధికంగా ఉంటుందని.. తన కుమారుడిపై కేసు నమోదైన విషయాన్ని తాను దాచిపెట్టడం లేదని.. అక్రమాలకు పాల్పడితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దీంతో మంత్రి మాట్లాడిన మాటలను గులాబీ పార్టీ అనుకూల మీడియా మరో విధంగా ప్రచారం చేస్తోంది. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.
బ్రేకింగ్ న్యూస్
అవును నిజమే నా కొడుకు మీద కబ్జా కేసు బుక్ అయింది
ఒప్పుకున్న మంత్రి పొంగులేటి
తప్పుంటే నా కొడుకైనా, నేనైనా శిక్ష అనుభవించక తప్పదు
తన కొడుకుపై నమోదైన ఎఫ్ఐఆర్ గురించి స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి https://t.co/4vJ1grQqZ8 pic.twitter.com/VD3TdXQVt3
— Telugu Scribe (@TeluguScribe) December 5, 2025