HomeతెలంగాణBC Caste census : ప్రభుత్వ సర్వేలో బీసీల్లో వారే టాప్.. మిగతా కులాల జనాభా...

BC Caste census : ప్రభుత్వ సర్వేలో బీసీల్లో వారే టాప్.. మిగతా కులాల జనాభా ఎంతంటే?

BC Caste census :  ముదిరాజుల తర్వాత యాదవులు ఉన్నారని.. వీరి సంఖ్య 20 లక్షల కంటే ఎక్కువ ఉందని సమాచారం. యాదవుల తర్వాత గౌడ కులస్తుల జనాభా ఎక్కువగా ఉందని.. సర్వేలో పర్ జనాభా 16 లక్షలకు పైగా ఉందని తేలింది. గౌడ కులస్తుల తర్వాత మున్నూరు కాపులు (munnuru kapu) అధికంగా ఉన్నట్టు సమాచారం. మున్నూరు కాపుల జనాభా 13.7 లక్షలు ఉన్నట్టు తెలింది. ఇక ఐదో స్థానంలో పద్మశాలిలు ఉన్నారని.. వీరి జనాభా 12 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1.60 కోట్ల మంది బీసీలు ఉన్నారని.. ముదిరాజ్, యాదవ గౌడ, మున్నూరు కాపు, పద్మశాలిల జనాభానే బీసీ సామాజిక వర్గంలో సగం ఉంటుందని తెలుస్తోంది.. అగ్రవర్ణాల విషయంలో రెడ్ల జనాభా తెలంగాణలో 17 లక్షల కంటే ఎక్కువ ఉందని తెలుస్తోంది. అయితే ఈ లెక్కలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఇక తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల సర్వే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. వివిధ కులాల జనాభా, స్థితిగతులు ఆధారంగా రిజర్వేషన్లు.. ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరింది. తెలంగాణలో మాదిరిగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర, సామాజిక ఆర్థిక , ఉపాధి , విద్య, రాజకీయ , కుల సర్వే నిర్వహించాలని కేంద్రాన్ని కోరింది.

కేంద్రం అనుమానమే

తెలంగాణ ప్రభుత్వం పంపించినట్టుగా కేంద్రం సర్వే చేపడుతుందనేది అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని పార్లమెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తావించగా.. దానిని బిజెపి పెద్దలు తిరస్కరించారు. కాంగ్రెస్ నాయకులు దేశవ్యాప్తంగా ప్రజలను కులాలవారీగా విభజిస్తున్నారని.. ఇలా అయితే దేశం మొత్తం వర్గాలుగా విడిపోతుందని ఆరోపించారు. ఇలాంటి సర్వేకు తాము వ్యతిరేకమని.. ఇలాంటి విధానాలను కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని బిజెపి పెద్దలు హితవు పలికారు. ఒకవేళ కేంద్రం కనుక తమ సర్వేకు ఆమోదముద్ర వేయకపోతే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.. దీంతో కేంద్రం ఆమోద ముద్ర వేయనప్పటికి తాము ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ భరోసా ఇచ్చారు. మరోవైపు ఈ సర్వేపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోపభూయిష్టంగా సర్వే జరిగిందని.. ఏకంగా రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఇలాంటి సర్వేతో దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఎలా డిమాండ్ చేస్తారని కేటీఆర్ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular