HomeతెలంగాణMLC Election Results : ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపుపై అనుమానాలు!?

MLC Election Results : ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపుపై అనుమానాలు!?

. పట్టభద్రుల ఎన్నికల తీరుపై ఇరుపార్టీల్లో అంతర్మథనం.. పోస్టుమార్టం
. ఎన్నికల అనంతర పరిణామాలపై అంతర్గత చర్చ

MLC Election Results  : ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సంరంభం ముగిసింది. కాని గెలుపోటములపై మాత్రం అన్ని పార్టీ శిబిరాల్లో సుదీర్ఘ సమీక్షలు ప్రారంభమయ్యాయి. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, ఖమ్మం స్థానాలను గెల్చుకున్నబీజేపీ, కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో మాత్రమే చావు తప్పి కన్ను లొట్టపోయిందని విమర్శ పార్టీ అధినాయకత్వాన్నిఆలోచనలో పడవేసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే కాదు, కనీసం రెండు, మూడు ప్రాధాన్యత ఓట్లతోనైనా నిర్ధేషించిన 1,11,672 ఓట్లు (50% + 1) మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేక, మెజార్టీ ఓటుతో ఎలాగోలా బీజేపీ అభ్యర్థి గెలిచారని అనిపించుకున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. ఐతే ఎన్నికలు పూర్తైనా తరువాత గెలిచిన పార్టీ ఎలా గెలిచామో, ఓడినా పార్టీ ఎలా పరాజయం పాలయ్యామనే విషయాలపై అంతర్గత పార్టీ శ్రేణులతో విశ్లేషించుకోవడం సర్వసాధారణమే.

Also Read : రేవంత్‌ వచ్చినా.. రిజల్ట్‌ మారలే.. అధికారంలో ఉన్నా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ స్థానం నిలబెట్టుకోలే..!

ఓటమికి కారణాలివేనా..?

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓడిపోయిందో లోతుగా అధ్యయనం చేసే పనిని ప్రారంభించింది.
పార్టీ అభ్యర్థి ఓటమికి గల కారణాలను, ప్రధాన పాత్ర పోషించిన అంశాలు ఏమిటి.? అనే వాటిపై అంతర్గత సర్వేకు పూనుకుంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వనందున పార్టీ ఈ గెలుపోటములపై పార్టీ నాయకుల నుంచి శ్రేణులు సైతం పట్టించుకోలేదు. కానీ గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల అభ్యర్థిత్వంలో పార్టీ సమర్థవంతమైన అభ్యర్థిని ఎంచుకున్నప్పటికీ, ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ స్థానాన్ని కోల్పోయింది. కాబట్టి పార్టీ దీనిని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ ఈ ఫలితానికి కారణాలపై వివిధ కోణాలలో విశ్లేషించాలని నిర్ణయించుకుంది. కాబట్టి పార్టీ సుప్రీం నాయకులు, పార్టీ అభ్యర్థితో పాటు ఎన్నికల్లో బాధ్యతలు తీసుకున్న నాయకులతో పాటు కేడర్‌ను అందుకు గల కారణాలను అడుగుతోంది. తదుపరి ఎన్నికలలో పార్టీ ఇమేజ్‌పై ఈ ఎన్నిక ప్రభావం చూపుతుందని పార్టీ గట్టిగా భావిస్తోంది. అందుకే చర్యలకు పూనుకుంది.

MLC Result
MLC Result

చెల్లని ఓట్లే కొంపముంచాయా.?

పోలైన మొత్తం ఓట్లలో 28,686 ఓట్లు చెల్లకుండా పోవడం ఫలితాలను తారుమారు చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థికి వేసిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువ భాగం చెల్లకుండా పోయాయి. నాయకులు మరియు క్యాడర్ ఓటర్లను సరైన రీతిలో ఓటు వేసేలా ఎందుకు అవగాహన కల్పించలేకపోయారు. గ్రాడ్యుయేట్ ఓటర్లలో ఎక్కువ మంది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేరనడానికి ఇది అతి ముఖ్యమైన సంకేతం. కానీ వారు తమ ఓటు సరైన విధంగా ఉపయోగించుకోలేక పోయారు. ఇది కేవలం ఎన్నికల నిర్వాహణ అధికారుల తప్పు మాత్రమే కాదు, పార్టీ క్యాడర్ కూడా అందుకు బాధ్యులేనని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు వెళ్లే ముందు పార్టీ క్యాడర్ ఓటర్లు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో వారికి అవగాహన కల్పించే విషయంలో విఫలమైనట్లు తెలుస్తోంది. అయితే గ్రాడ్యుయేట్లు కనీసం ఈ ఎన్నికల్లో ఓటు సరైన విధంగా ఎలా వేయాలో తెలుసుకోలేక పోవడంతో కూడా కారణంగా భావిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఇది ఫలితాలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపింది.

MLC Result
MLC Result

సమన్వయ లోపం..

పార్టీ కార్యకర్తలలో చాలా మంది విజయం కోసం అవిశ్రాంతంగా పోరాడారు. కొన్నిచోట్ల నాయకుల నుంచి వారికి సపోర్టు లభించకపోయినా పార్టీ అభ్యర్థి గెలవాలని ప్రయత్నం మాత్రం ఆపలేదు. బూత్ స్థాయి నుంచి నియోజకవర్గం ఈ విషయంలో ఏం తప్పిదం జరిగిందో విశ్లేషించాలని పార్టీ నిర్ణయించుకుంది. దీంతో కొంతమంది పార్టీ నాయకుల్లో గుబులు పట్టుకుంది. పార్టీ అధికార ప్రతినిధిగా చెప్పుకుని సోషల్ మీడియాలో అధిష్టానానికి వ్యతికంగా వ్యాఖ్యలు చేసిన వారిపై పార్టీ అంతర్గత క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.

Also Read : పోస్టుమార్టం: బీజేపీ అంజిరెడ్డి ఎందుకు గెలిచాడు.. కాంగ్రెస్‌ నరేందర్‌ రెడ్డి ఎందుకు ఓడాడు?

బీఆర్ఎస్ భవితవ్యం ప్రశ్నార్థకం..

ఈ తరుణంలో బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటి. ప్రధాన నాయకులు పార్టీ మారాలని ఆలోచిస్తున్నారా..? వారు పార్టీ మారాలని నిర్ణయించుకుంటే వారి ప్రధాన ఎంపిక ఏమిటి..? కొందరు కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో చేరాలని అనుకోవచ్చు. కొందరు తమ భవిష్యత్ రాజకీయ జీవితం కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గురించి ఆలోచించవచ్చు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా చాలా మంది నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం ఈ రెండు పార్టీలలో చేరారు. కొంతమంది నాయకులు పార్టీ మారడానికి సమయం కోసం వేచి ఉన్నారు. ఈ సమయంలో నిర్ణయం తీసుకోవడంలో పార్టీ సందిగ్ధంలో ఉంది. అదే సమయంలో పార్టీని ఎంచుకోబోయే నాయకులు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఈ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై అధిష్ఠానం ఆలోచనలో పడింది.

-దహగాం శ్రీనివాస్,
సీనియర్ జర్నలిస్ట్

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular