HomeతెలంగాణRaj Pakala: నాడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తే కేసులు పెట్టారు.. ఇప్పుడేమో కేటీఆర్ బామ్మర్ది అడ్డంగా...

Raj Pakala: నాడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తే కేసులు పెట్టారు.. ఇప్పుడేమో కేటీఆర్ బామ్మర్ది అడ్డంగా బుక్కయ్యారు

Raj Pakala: రాజ్ పాకాల హై ప్రొఫైల్ వ్యక్తి అని. పెద్దపెద్ద వివిఐపీల పార్టీల ఈవెంట్స్ నిర్వహిస్తారని.. అందులో మాదకద్రవ్యాలను వాడతారని.. దానికి తెర వెనుక కేటీఆర్ ప్రోత్సాహం ఉందని.. రేవంత్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. దీనిపై రాజ్ పాకాల అప్పట్లో ఘాటుగా స్పందించారు. న్యాయపరంగా వెళ్తానని రేవంత్ రెడ్డికి నోటీసులు పంపించారు.. పరువు నష్టం దావా కేసులు కూడా వేస్తున్నట్టు ప్రకటించారు. అప్పట్లో భారత రాష్ట్ర కమిటీ కూడా రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. పైగా రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా వార్తలను ప్రచురించింది. ఈలోపు కాలం గడిచింది. అధికారం మారిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. నార్కోటిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేశారు. మాదకద్రవ్యాల ఊసనేది తెలంగాణలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు గంజాయి, ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసే వ్యక్తులపై ఉక్కు పాదం మోపుతున్నారు. అయితే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు.. రేవంత్ రెడ్డి గతంలో చేసిన విమర్శలకు బలాన్ని చేకూర్చుతూ.. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఓ పార్టీ నిర్వహిస్తూ దొరికిపోయారు. అందులో మాదకద్రవ్యాలు వినియోగించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. విదేశాల నుంచి పరిమితికి మించి దిగుమతి చేసుకున్న మద్యం.. క్యాసినో పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు విజయ్ అనే వ్యక్తి మూత్రాన్ని పరిశీలించగా.. అందులో మాదకద్రవ్యాలు ఉపయోగించినట్టు తేలింది. అయితే కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

కేటీఆర్ స్నేహితుడి ఫామ్ హౌస్ ఉన్నచోటే..

జన్వాడ రిజర్వు కాలనీలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు ఫామ్హౌస్ ఉంది. ఇదే ప్రాంతంలో కేటీఆర్ స్నేహితుడికి కూడా ఫామ్ హౌస్ ఉంది. దానిని కేటీఆర్ ఉపయోగిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో భారీ శబ్దాలతో పార్టీ చేసుకుంటున్న నేపథ్యంలో స్థానికులు ఫిర్యాదు చేశారు.. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఫామ్హౌస్ పై దాడి చేశారు.. ఇక అందులో ఒక వ్యక్తికి మాదకద్రవ్యాల నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. అతనిపై కేసు నమోదు చేశారు. ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఇక ఆ ప్రాంతంలో దొరికిన మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. సెక్షన్ 34 ఎక్సైజ్ ఆక్ట్ కింద కేసు నమోదు చేశారు.. ఈ పార్టీలో మొత్తం 42 మంది పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇందులో రాజ్ ప్రమేయం ఏ స్థాయిలో ఉంది అనే దానిపై పోలీసులు ఆరాధిస్తున్నారు. రాజ్ పాకలకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఉంది.. ప్రస్తుత పార్టీ ఆయన కను సన్నల్లోనే జరిగిందని పోలీసులు అంటున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం ఒక కేసులో రాజ్ పాకాల ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అవి అవాస్తవాలంటూ.. ఆ వార్తలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు రాజ్. కానీ ఇప్పుడు ఆయన మాత్రం ఈ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?!

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular