Karimnagar CP on leave: అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికి పోలీసులు అనుకూలంగా పనిచేయడం సాధారణమే. పదేళ్లు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. దీంతో నాటి ప్రభుత్వ ఆదేశాల మేరకు చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు పనిచేశారు. ప్రజాప్రతినిధుల పాదాల వద్ద మోకరిల్లిన ఘటనలూ ఉన్నాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో ఉన్నతాధికారులు ఇప్పుడు కాంగ్రెస్కు కాస్త అనుకూలంగా ఉంది. తాము చెప్పినట్లు చేయకుంటే బదిలీ ఖాయం. తాజాగా కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై ఖద్దర్ ఒత్తిడితో ఆయన సెలవుపై వెళ్లారు. ఇసుక వ్యాపారంలో ముప్పటిపడిన ఎస్సైని సస్పెండ్ చేయగా, స్థానిక ఎమ్మెల్యే ఫోన్ల ద్వారా ఒత్తిడి చేశారు. విసుగు చెందిన సీపీ సోమవారం నుంచి సెలవులో ఉన్నారు.
అవినీతి చర్యల నేపథ్యం
సీపీ అక్రమాలను నియంత్రించడంలో భాగంగా ఇసుక అక్రమార్కులకు అండగా నిలుస్తున్న ఎస్సైపై చర్య తీసుకున్నారు. ఇది స్థానిక ఎమ్మెల్యేకు కోపం తెప్పించింది. అధికారిని కాపాడేందుకు సీపీ గౌస్ ఆలంకు పదేపదే సంప్రదించారు. ఫోన్ కాల్స్ ద్వారా వచ్చిన ఒత్తిళ్లు పోలీసు అధికారిని బాధించాయ. దీని ఫలితంగా సీపీ విధుల నుంచి దూరమయ్యారు. ఇది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పోలీస్ శాఖలో చర్చ..
ఈ ఘటన పోలీసు వ్యవస్థలో రాజకీయ జోక్యానికి ఉదాహరణగా నిలుస్తోంది. అక్రమాలను అడ్డుకునే అధికారికి కూడా ఇబ్బందులు తప్పవని పోలీసులు గుసగుసలాడుకుంటున్నారు. నిజాయతీగా పనిచేయడం కూడా తప్పేనా అని చర్చించుకుంటున్నారు. రాజకీయ ప్రభావంతో విధులు ఎలా నిర్వహించాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
పోలీసు స్వాతంత్య్రానికి రక్షణ చట్టాలు బలోపేతం చేయాలి. రాజకీయ ఒత్తిళ్లపై పరిశోధనలు నిర్వహించేలా చూడాలి. అవినీతి ఫిర్యాదులకు వేగవంతమైన చర్యలు తీసుకునేలా సహకరించాలి.