KCR Is God, Surrounded By Some Devils: ఇంకా దిగజారదు.. ఇంతకంటే తక్కువ స్థాయికి వెళ్లదు అనుకున్న ప్రతిసారి గులాబీ పార్టీ మౌత్ పీస్.. అంతకుమించి అని చూపిస్తోంది. తాజాగా గులాబీ సుప్రీం కూతురు రాసిన లేఖను ఫేక్ అంటూ సొంత భాష్యం చెప్పిన.. గులాబీ కరపత్రం.. శనివారం నాటి ఎడిషన్ లో కవిత వార్తకు బ్యానర్ స్థాయి ప్రయారిటీ మాత్రం తగ్గలేదు. ఏదో గులాబీ మొక్కకు దెబ్బ తగలకుండా.. గులాబీ బాస్ కు ఇబ్బంది కలగకుండా.. కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలను.. బిజెపి, కాంగ్రెస్ పార్టీలను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను మాత్రమే గులాబీ పార్టీ మౌత్ పీస్ హైలెట్ చేసింది.. లేఖ విషయంలో ఫేక్ అని నిర్ధారించిన గులాబీ కరపత్రం.. మరుసటి రోజుకే తన వాయిస్ మార్చింది. తన స్టాండ్ మార్చుకుంది.. వాస్తవానికి నిన్న కవిత మాట్లాడిన మాటలకు సంబంధించి గులాబీ పార్టీ అనుకూల మీడియా ఒక వార్తను కూడా ప్రసారం చేయలేదు. ఇక సోషల్ మీడియా సైతం పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. శనివారం ఉదయం నాటికే పరిస్థితి ఒకసారి గా మారిపోయింది. గులాబీ పార్టీ మౌత్ పీఎస్ లో కవిత వార్తకు కొంతలో కొంత ప్రయారిటీ దక్కింది. వాస్తవానికి ఇటీవల కాలంలో కవితకు గులాబీ పార్టీ మీడియాలో స్పేస్ లేదు. ప్రయారిటీ అంతకన్నా లేదు. ఏదో తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తోంది.
యంగ్ ఇండియన్ కంపెనీలో షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, పి సుదర్శన్ వంటి వారు పెట్టుబడులు పెట్టిన విషయాన్ని తాటికాయ సైజు అక్షరాలతో రాసిన గులాబీ పార్టీ మౌత్ పీస్.. కవిత రాసిన లెటర్ ను ఎవరు బయటపెట్టారో చెప్పకపోవడం విశేషం. ” గులాబీ సుప్రీమే మా నాయకుడు.. లెటర్ రాసింది.. నేనే. ఎప్పుడూ రాసేదే! లెటర్ ఎలా బయటికి వచ్చిందో తెలియదు” అనే కోణాలను గొప్పగా రాసిన గులాబీ పార్టీ మౌత్ పీస్.. శంషాబాద్ విమానాశ్రయం దగ్గరికి జాగృతి కార్యకర్తలు తప్ప.. గులాబీ పార్టీ శ్రేణులు ఎందుకు వెళ్లలేదు? ఎరవల్లి ఫామ్‌హౌస్ వెళ్లాల్సిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తన సొంత ఇంటికి ఎందుకు వెళ్లిపోయింది.. కవిత రాసిన లేఖపై గులాబీ పార్టీ పెద్దలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? కొందరు కావాలనే ఆ లెటర్ లీక్ చేశారని ఆరోపిస్తున్నప్పుడు? అది చేసింది ఎవరు? అనే విషయాలను పూర్తిగా విస్మరించి.. షుగర్ కోటెడ్ న్యూస్ ప్రజెంట్ చేసింది గులాబీ పార్టీ మౌత్ పీస్. అన్నట్టు ఆ లెటర్ రాసిందే నేనే అని కవిత ఒప్పుకుంది కాబట్టి సరిపోయింది.. లేకుంటే నా ఈపాటికి ఆంధ్రా పార్టీల కుట్ర, ఢిల్లీ పెద్దల మోసం.. తెలంగాణ రాష్ట్రంపై మయోపాయాలు, తెలంగాణ ఇంటి పార్టీ ఔచిత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం.. అంటూ దుమ్మెత్తి పోసేది. అంతేకాదు ప్రజల్లో బలవంతంగా సెంటిమెంట్ రగిలించేది..
అప్పట్లో కేంద్ర ప్రభుత్వంపై.. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో శోధన చేస్తూ.. పేజీలకు పేజీలకు వార్తలు కుమ్మేస్తూ గులాబీ భజన చేస్తున్న.. ఆ సోకాల్డ్ పేపర్ కు గులాబీ ఎమ్మెల్సీ లేఖను లీక్ చేసిన దయ్యాలు ఎవరో తెలియదా? అంటే ఆ పార్టీ మౌత్ పీస్ పాత్రికేయం గిట్టని వాళ్ళ మీద రాళ్లు వేయడానికి.. నచ్చని వాళ్ళ మీద దుమ్మెత్తి పోయడానికి మాత్రమే పనికొస్తుందా? దీనిని జర్నలిజం అంటారా? ఏమో ఈ ప్రశ్నలకు ఆ పార్టీ మౌత్ పీస్ ఎలాంటి సమాధానం చెబుతుందో? అన్నట్టు ఇలాంటి ప్రశ్నలు వేసిన వారిని ఆంధ్రా పెత్తందారులు అని ఆరోపించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అంతా బభ్రజమానం భజగోవిందం!