BRS Vs Kavitha: కల్వకుంట్ల కవిత కొత్త ’తెలంగాణ రాష్ట్ర సేన’ (టీఆర్‌ఎస్) పార్టీ పేరుతో కొత్త పార్టీ ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగానే ఏప్రిల్ 25న నిర్వహించిన సమావేశంలో కొత్త పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత సుదీర్ఘంగా మాట్లాడారు. ఇంతకాలం తండ్రి కేసీఆర్‌పై ఎలాంటి విమర్శలు చేయని కవిత.. తాజాగా పార్టీ ప్రకటన సభలో ఈసారి తండ్రిని కూడా గట్టిగనే అర్సుకుంది. ఇక టీఆర్‌ఎస్ ప్రకటనపై బీఆర్‌ఎస్ పాత టీఆర్‌ఎస్ స్పందించింది. కవిత ప్రసంగం పూర్తయిన కొన్ని నిమిషాలకే ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. ‘ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే’ అనే ట్యాగ్‌లైన్‌తో సెటైరికల్ ట్వీట్ పోస్ట్ చేసి, తమదే అసలు తెలంగాణ పార్టీ అని పరోక్షంగా ప్రకటించుకుంది.
కోల్గేట్ పేస్ట్, వాటర్ బాటిల్స్ పొటో..
ఈ ట్వీట్‌లో బీఆర్‌ఎస్ కోల్గేట్, బిస్లరీ ఒరిజినల్ ప్రొడక్టులు, డూప్లికేట్ ఫొటోలను షేర్ చేసింది. డూప్లికేట్ ఎన్ని వచ్చినా ఓరిజినల్‌కు ఉన్న ఓరిజినల్‌కు ఉంటుందని పేర్కొంది. కవిత పార్టీని ’కాపీకట్’గా చిత్రీకరిస్తూ, టీఆర్‌ఎస్ పేరును ’ఒరిజినల్’ బీఆర్‌ఎస్‌కు దత్తత ఇచ్చినట్లు హాస్యంగా సూచించింది.
మనమే అసలు తెలంగాణ బ్రాండ్
ట్వీట్ ద్వారా బీఆర్‌ఎస్ తన ’ఒరిజినల్’ ఇమేజ్‌ను రీఅన్‌ఫోర్స్ చేసింది. కవిత పార్టీని ’ఇమిటేషన్’గా చూపి, రాష్ట్రవాసులకు ’అసలు, నకిలీ’ మెసేజ్ ఇచ్చింది. ఇది ఓటర్ల మనసుల్లో సందేహాలను నాటుతూ, బీఆర్‌ఎస్ లెగసీని రక్షించాలనే వ్యూహం. ఈ సెటైర్ తెలుగు ట్విటర్‌లో వైరల్ అవుతోంది. బీఆర్‌ఎస్ నేతలు మద్దుతు తెలుపుతున్నారు. దీనిపై కవిత నుంచి కూడా రిప్లయ్ వచ్చే అవకాశం ఉంది.
బీఆర్‌ఎస్ ఈ కౌంటర్‌తో కవిత పార్టీని ’కాపీ’గా ఫిక్స్ చేయాలనుకుంటోంది. హాస్యం ద్వారా గుర్తించబడే ’ఒరిజినల్’ ఇమేజ్‌ను బలోపేతం చేస్తోంది. అయితే, కవిత ఎజెండా (పాంచజన్యం) ఆకర్షణీయంగా ఉంటే, ఈ సెటైర్ బ్యాక్‌ఫైర్ అవ్వొచ్చు. రాబోయే ఎన్నికల్లో ఓటర్లు ’ఒరిజినల్’ను ఎంచుకుంటారో చూడాలి.
ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే! pic.twitter.com/YBlx20tlRf
— BRS Party (@BRSparty) April 25, 2026