Kavitha attack on Harish: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్‌ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి. కవిత రాజీనామా ఆమోదం కూడా చర్చనీయాంశమైంది. దీనిపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. సుఖేందర్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్ నేతనే. అందుకే రాజీనామా ఆమోదం ఆలస్యం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే రాజకీయం లేదని, కవిత నేరుగా రాజీనామా చేకపోవడంతోనే సమయం ఇచ్చామన్నారు. మండలిలో మాట్లాడిన తర్వాత ఆమోదం తెలిపానని స్పష్ట చేశారు.
హరీశ్ టార్గెట్‌గానే కవిత..
కవితను కాంగ్రెస్ ప్రేరేపించి షర్మిల మాదిరిగా పార్టీ పెట్టించి విలీనం చేయాలని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేసీఆర్, కేటీఆర్ కలిసి హరీశ్ రావును సైడ్‌లైన్ చేసే డ్రామా ఆడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. హరీశ్‌ను పార్టీ నుంచి పంపిస్తే నష్టం హరీశ్‌కన్నా పార్టీకే ఎక్కువ. ఈవిషయం తెలిసే కవితను పార్టీ నుంచి పంపించారు. కానీ హరీశ్‌ను తప్పిస్తే పార్టీ చీలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
.
హరీశ్, కేటీఆర్ ఐక్యంగా..
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్, హరీశ్ మధ్య విభేదాలు ఉండేవి. కానీ ప్రస్తుతం సమన్వయం కనిపిస్తోంది. పార్టీ కోసం ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. హరీశ్‌ను బయటపెడితే పార్టీకి నష్టమే కలుగుతుంది. ఈ సహకారం బీఆర్‌ఎస్ భవిష్యత్తును బలపరుస్తుంది.
మండలిలో బీఆర్‌ఎస్ ఆధిపత్యం పార్టీకి ఆధారం. కవిత విషయం ప్రచారాలను పెంచినా, లోపలి ఐక్యత పట్టుకుంటుంది. కాంగ్రెస్ ప్రభావాలు, కుట్రలు అంచనాలు మాత్రమే. పార్టీ పునరుద్ధరణకు ఈ సమయం కీలకం.