Hyderabad ఒక మనిషి తల్లి గర్భంలో నుంచి అవయవాలు, జుట్టు వంటి వాటితో పుట్టిన తర్వాత.. ఈ భూమ్మీద ఉండే వాతావరణానికి అనుగుణంగా తన శరీరాన్ని మార్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇక మనం ఉండే వాతావరణం మొత్తం రకరకాల మార్పులతో కూడుకొని ఉంటుంది. వాటికి శరీరం తట్టుకోవాలి. తట్టుకొని నిలబడగలగాలి. అయితే కొన్ని సందర్భాల్లో జన్యు మార్పుల వల్ల కొంతమందికి జుట్టు ఊడిపోతుంది. కొంతమందికి తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. ఊడిపోయిన స్థానంలో కొత్త జుట్టును మొలిపించడం గతంలో కష్టమైన ప్రక్రియ గా ఉండేది. అయితే ఇప్పుడు రకరకాల ప్రయోగాలు.. అధునాతన వైద్య విధానాల వల్ల అది నూటికి నూరు శాతం కాకపోయినా.. కొంతలో కొంత జుట్టు రావడానికి ఉపకరిస్తోంది. ఇక తెల్ల వెంట్రుకల విషయంలోనూ ఇలాంటి ప్రయోగాలే జరుగుతున్నాయి. కాకపోతే జుట్టు తెల్లబడడాన్ని కూడా ఒక రకమైన భయంగా భావించే చాలామంది హెయిర్ డై వేసుకుంటారు. ఇప్పుడు ఇక మార్కెట్లో కూడా రకరకాల హెయిర్ డై లు అందుబాటులోకి వచ్చాయి. అందులో అనేక రంగులు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే హెయిర్ డైలు అధికంగా వాడితే క్యాన్సర్ వంటి వ్యాధి ముప్పు ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది హెయిర్ డైలు ఉపయోగించడం తగ్గించడం లేదు.
బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ..
సరిగ్గా 16 సంవత్సరాల క్రితం బట్టతల పై జుట్టు మొలిపిస్తామంటూ ఒక ప్రకటన వచ్చింది. ఆ హెయిర్ ఆయిల్ వాడితే జుట్టు వస్తుందని ప్రచారం చేసింది. చివరికి జుట్టు రాసుకున్న తర్వాత అరచేతులను శుభ్రంగా కడుక్కోవాలని.. లేకుంటే అరచేతిపై కూడా జుట్టు వస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. కానీ ఆ ఆయిల్ వాడిన ఏ ఒక్కరికి కూడా జుట్టు రాలేదు. కానీ ఆ హెయిర్ ఆయిల్ తయారు చేసిన సంస్థ మాత్రం 100 ల కోట్లు సంపాదించింది. ఇప్పుడు కూడా ఆ కంపెనీ తన ఉత్పత్తిని తయారు చేస్తూనే ఉంది. కానీ ఇంతవరకు ఆ సంస్థపై ఏ ప్రభుత్వం, ఏ వ్యవస్థ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక తాజాగా ఢిల్లీలో పాతబస్తీ దర్వాజా వద్ద షకీల్ బాయ్ అనే వ్యక్తి నిర్వహించే సెలూన్ మందు వందల మంది యువకులు బారులు తీరారు . వారంతా కూడా బట్టతల బాధితులు. జూట్టుమొలిపిస్తామని చెప్పి ఓ వ్యక్తి విపరీతంగా ప్రచారం చేశాడు. హిందీ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తికి బట్ట తల ఉంటే.. అతడికి జుట్టు మొలిపించానంటూ సదరు వ్యక్తి ప్రచారం చేశాడు. దీంతో బట్టతల బాధితులు మొత్తం ఆ వ్యక్తి సెలూన్ వద్దకు వచ్చారు. దీంతో అతడు వారందరికీ గుండు గీశాడు. ఆ తర్వాత వారి తలపై ఏదో కెమికల్ పూశాడు. ఆ కెమికల్ వల్ల కొత్త జుట్టు రాకపోగా.. దుష్పరిణామాలు వచ్చాయి. దీంతో వారంతా ఆసుపత్రిలో చేరారు. వారిని పరీక్షించిన వైద్యులు.. చికిత్స చేస్తున్నారు. కెమికల్ పూసుకున్న వారందరి తలలు వాచాయి. కొంతమందికి విపరీతంగా తలనొప్పులు వచ్చాయి. కొందరికి కళ్ళలో నుంచి నీరు కారాయి. అయితే బట్టతల బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆ వ్యక్తి ఏదో కెమికల్ పూశాడని.. దానివల్ల కొత్త జుట్టు రాకపోగా.. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని స్థానికులు అంటున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఢిల్లీలో సంచలనంగా మారింది. దీనిపై పోలీసులను ఆశ్రయించేందుకు బట్టతల బాధితులు సిద్ధమవుతున్నారు.
Bald men land in hospital in Hyderabad after trying "Hair Regrowth lotion" @TheSiasatDaily #Hyderabad #Bald pic.twitter.com/QNmxR9vQVU
— Mohammed Baleegh (@MohammedBaleeg2) April 7, 2025