Hyderabad Global Cine Hub: హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో రెండు రోజులు(డిసెంబర్ 8, 9)నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబస్ సమ్మిట్ ముగిసింది. రెండో రోజు అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. భారీగా పెట్టుబడులకు వ్యాపారులు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఇక ఈ సమ్మిట్‌కు సినిమా ఇండస్ట్రీ ప్రతినిధిగా వచ్చానని చెప్పిన చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విజన్‌ను ప్రశంసించారు. ఇండస్ట్రీ విజన్ చాలా బాగుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి ప్రముఖులు ఆధునిక స్టూడియోలను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
సినిమా పరిశ్రమ అభివృద్ధికి సహకారం..
గ్లోబల్ సమ్మిట్ వేదికపై అన్ని భాషల సినిమాలకు స్థానమివ్వాలని, హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఒక సినిమా హబ్‌గా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి సంకల్పం ప్రతిష్ఠాత్మకమైందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా వినోద రంగ అభివృద్ధికి వేవ్స్ కార్యక్రమం ద్వారా సహకారం అందిస్తున్నారు.
శిక్షణ కేంద్రాల ఏర్పాటు అవసరం..
సినీరంగానికి సంబంధించిన 24 శాఖలకు సంబంధించిన నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణ సంస్థ అవసరమని చిరంజీవి సూచించారు. దీనితో తెలంగాణ వినోద రంగంలో యువ ప్రతిభలకు మంచి అవకాశాలు లభిస్తాయని విశ్వసిస్తున్నారు. హైదరాబాద్ అందుబాటులో ఉన్న వనరులు, ట్రాన్స్‌పోర్ట్ట్, మల్టీ లాంగ్వేజ్ కారణంగా గ్లోబల్ సినిమాల షూటింగ్‌కి అనువైన వాతావరణమని మెగాస్టార్ అభిప్రాయపడ్డారు.
ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ పరిశ్రమపై గౌరవం, వారి విజయం ప్రశంసలను మెగా స్టార్ చిరంజీవి ముఖ్యంగా ప్రచారం చేశారు.