Ramoji Rao: తాజాగా మార్గదర్శి కేసులో తెలంగాణ హైకోర్టు లో విచారణ నడిచింది. ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ తన వాదనలు వినిపించింది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందేనని.. రామోజీరావు మరణించినట్లు మాత్రాన కేసుల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదని రిజర్వ్ బ్యాంక్ తరఫున న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసు గత 18 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ కేసు కోర్టులో ఫైల్ అయిన దగ్గర్నుంచి దివంగత రామోజీరావు ఏ తప్పూ చేయలేదు. నిస్పక్షపాతంగానే వ్యవహరిస్తోంది.. నిబంధనల ప్రకారమే చిట్స్ సేకరిస్తున్నది. ఇంతవరకు ఎవరూ మార్గదర్శకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదు. మార్గదర్శి సక్రమంగానే చిట్స్ చెల్లింపులు జరిపింది. ఇందులో ఎవరికీ అన్యాయం జరగలేదు.. అలాంటప్పుడు ఈ కేసులో దమ్ము లేదు. ఏదో రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారని” ఈనాడు రాసుకు వస్తున్నది.
కిరణ్ ఏమంటున్నారంటే..
మార్గదర్శి కేసులో ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో.. ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ స్పందించాల్సి వచ్చిందని.. రామోజీరావు చనిపోయారు కాబట్టి ఆయన కేసులతో తనకు సంబంధం లేదనే తీరుగా కిరణ్ వ్యాఖ్యానించారని సాక్షి పత్రికలో ఓ కథనం ప్రసారమైంది, ప్రచురితమైంది. ఈ కేసును మిగతా మీడియా సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. సాక్షి మాత్రం బ్యానర్ వార్తగా ప్రచురించింది. ఏపీ ఎడిషన్లో మరింత లోతుగా కథనాలను ప్రచురించింది. దీంతో మార్గదర్శి కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మార్గదర్శి కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి.. యధావిధిగా చిట్స్ సేకరణ కొనసాగుతోంది. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు మార్గదర్శిపై సంస్థలపై దాడులు చేయించారు. ఏపీ సిఐడి అధికారులతో రామోజీరావును ప్రశ్నించారు.. చివరికి మార్గదర్శి సంస్థ చిట్స్ సేకరించకుండా నిబంధనలను అడ్డుపెట్టారు. చివరికి మార్గదర్శి సంస్థను ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈనాడు ఏకపక్షంగా వార్తలు రాసింది. వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేసింది. ఈనాడు కోరుకున్నట్టుగానే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో మార్గదర్శి కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే మార్గదర్శి కేసులో రామోజీరావు పై పెట్టిన కేసులు తనకు వర్తించవని.. ఆయన కన్నుమూశారు కాబట్టి ఆ కేసులతో తన సంబంధం లేదని కిరణ్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.. ఈ క్రమంలో కిరణ్ పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. రామోజీరావు ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పిన కిరణ్.. కోర్టులో ఇలా వాదించడం ఏంటని మండిపడుతున్నారు. “మార్గదర్శి రామోజీరావు ఏర్పాటుచేసిన సంస్థ. దాని లాభాలను కిరణ్ కుటుంబం అనుభవిస్తున్నది. అలాంటప్పుడు ఆ సంస్థతో కిరణ్ సంబంధాలు తెంచుకుంటారా? ఇదేం తీరు? తండ్రి కేసులతో సంబంధం లేదని కొడుకు అంటున్నాడు అంటే దాన్ని ఏమనుకోవాలో అర్థం కావడం లేదని” వైసిపి నాయకులు కిరణ్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
18 ఏళ్ళుగా నేను తప్పు చెయ్యలేదు నన్ను ఎవడు ఏమి చెయ్యలేడు అని విర్రవిగిపోయిన రామోజీ రావు కి..
ఒక నికార్సయిన దమ్మున్నోడు ఎదురుపడ్డాడు అతనే @ysjagan
ఈరోజు ఆర్బీఐ,కోర్టులు తొక్కుతుంటే.. తప్పు చేసింది మేము కాదు మా తండ్రి అని రామోజీ కొడుకు అడుక్కునే పరిస్థితి తీసుకువచ్చాడు pic.twitter.com/PFDLhYcZnG
— RAJIV (@KingRajiv) February 15, 2025