Revanth Reddy : రాజకీయాల్లో… ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పదవీ చితుడిని చేయడానికి వెనకే కొందరు గోతులు తవ్వుతుంటారు. తనకన్నా పైన ఉన్నవారిని తొక్కితేనే తాను ఎదుగుతానని భావిస్తారు. ప్రస్తుత రాజకీయాల్లో చాలా మంది ఇలా పైకొచ్చినవారే. అయితే నేటి రాజకీయాల్లోనూ కొంత మంది నమ్మకంగా పనిచేసేవారు ఉన్నారు. నమ్మకానికి ప్రాణాలు సైతం ఇవ్వడానికి వెనుకాడరు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు కేవీపీ.రామచందర్‌రావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిని ముఖ్య అనుచరుడు. రాజశేఖరరెడ్డి శరీరం అయితే.. కేవీపీ ఆత్మ అంటారు. అంతలా వారి బంధం గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో అలాంటి మరో నేత ఎగుదుతున్నారు. ఆయనే వీఎన్‌ఆర్(వేం నరేందర్‌రెడ్డి). సీఎం రేవంత్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. వైఎస్సార్ కుటుంబ సభ్యుల కన్నా కేవీపీకే ఎక్కువ 6పాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా వీఎన్‌ఆర్‌ను తన కుటుంబ సభ్యులతో సమానంగా చూస్తున్నారు. స్నేహానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వైఎస్ లాగే రేవంత్ కూడా వేం నరేందర్ రెడ్డికే ముందు చెబుతారనిరేవంత్ సన్నిహితులే చెబుతున్నారు.
టీడీపీ నుంచే స్నేహబంధం..
రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డికి టీడీపీ నుంచే మంచి స్నేహబంధం ఉంది. అది మరింత బలపడి ఇప్పుడు కూడా కొనసాగుతుంది. రేవంత్‌రెడ్డి కష్ట నష్టాల్లో అడుగడుగునా నరేందర్‌రెడ్డి ఉన్నారని రేవంత్ సన్నిహితులు చెబుతుంటారు. ఒక రకరంగా చెప్పాలంటే రేవంత్ తన సోదరులను ఏవిధంగా నమ్ముతారో అదే స్థాయిలో నరేందర్ రెడ్డిని నమ్ముతారని ప్రచారంలో ఉంది. రేవంత్ ð‡డ్డి గతంలో కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్న రాజకీయ తీవ్ర ఆటుపోట్లలో కూడా ఆయన రేవంత్ రెడ్డికి చాలా భరోసాగా నిలిచారట. రేవంత్ కుటుంబానికి అండగా ఉండి వారికి మనోధైర్యం కల్పించారట. రేవంత్‌రెడ్డి తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని సమర్థిస్తూ, రేవంత్ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఏదైనా తనకు అండగా నిలిచారట. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరాలని అనుకున్న తరుణంలో కూడా ఆయన రేవంత్ వెంటే నడిచారు. ఏళ్లుగా చంద్రబాబుతో, టీడీపీతో ఉన్న బంధాన్ని కూడా రేవంత్ కోసం తెంచుకున్నారని టాక్. అలాంటి వ్యక్తికి రేవంత్ కూడా అదే స్థాయిలో విలువ ఇస్తున్నారు. రేవంత్ మాటన్నా, నరేందర్‌రెడ్డి మాటన్నా ఒకటే నట. ఇద్దరి మధ్య అంతలా అవగాహన ఉందట. తాను కలవలేని వాళ్లను రేవంత్‌రెడ్డి వేంనరేందర్ రెడ్డిని కలవమని చెబుతారట. నరేందర్ రెడ్డిని కలిస్తే తనను కలిసినట్టే అని చెబుతారట.
కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ..
సీఎం రేవంత్‌రెడ్డి, వేం నంరేందర్‌రెడ్డి స్నేహ బంధంపై కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరి నేతలను చూస్తుంటే గతంలో వైఎస్, కేవీపీ జోడీ గుర్తుకు వస్తుందని చర్చించుకుంటున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో తన ఆప్త మిత్రుడు కేవీపీ రాంచందర్ రావు కూడా ఇలానే వ్యవహరించే వారు. వైఎస్‌ను కలువాలనుకునే వాళ్లు కేవీపీనీ మొదట కలిసే వాళ్లు. ఒక దశలో కేవీపీ మాట ఇస్తే వైఎస్ ఇచ్చినట్లే అన్నట్లుగా ఉండేది. కానీ అదే సందర్భంలో కేవీపీ కూడా ఏనాడు తన హద్దులు దాట లేదు. తన పరిధి దాటి ప్రవర్తించిన సందర్భాలు లేవు. తన మిత్రుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏనాడు కూడా వమ్ము చేయకూడదు అనే ఆలోచనతోనే పనిచేశారు. వైఎస్ ఉన్నన్ని రోజులు కేవీపీ అతనికి ఆత్మగా ఉంటూ వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ బిజీగా ఉండడంతో కొందరిని కలవడం కుదరడానికి వీలులేకుండా పోయేది. దీంతో వైఎస్ కేవీపీనీ తెర మీదకు తెచ్చి తనకు చెప్పాల్సిన వివరాలను కేవీపీ ద్వారా తెప్పించుకునేవారు.
మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరో ఆత్మ దొరకింది. నాడు కేవీపీ లాగా ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా ఉంటూ అధికారం ఉందనే అహంకారం లేకుండా రేవంత్ ను కలవాలనుకున్న నేతలను ఎప్పటికప్పడు కలుస్తూ వారి అభిప్రాయాలను రేవంత్ కు చేరవేస్తున్నారట.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: How about kvp for ysr vnr for revanth reddy any decision is his first
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com