Government Employee Parents: రాజకీయ నాయకుల నిర్ణయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. మంచి నడవడిక సాగించేలాగా అడుగులు వేయిస్తుంటాయి.. సమాజాన్ని సరికొత్త దిశగా సాగేలా చేస్తుంటాయి. అలాంటి నిర్ణయమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణలో ఒక గేమ్ చేంజర్ మాదిరిగా మారింది. ఇంతకీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు? దానివల్ల ఎవరి జీవితాలు ప్రభావితమవుతున్నాయి అంటే?
ప్రతి సోమవారం తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి ఆయా జిల్లాల ప్రజల వస్తుంటారు. తమ సమస్యలను జిల్లా అధికారులకు చెప్పుకుంటారు. ఇందులో ఎక్కువగా తమ పిల్లలు తమను పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులే ఎక్కువగా ఉంటుంది. ఆ వృద్ధ తల్లిదండ్రులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పిల్లలు కనీసం చూడను కూడా చూడడం లేదు. పైగా వారిని వృద్ధాశ్రమాలలో వేస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. తమను ఇంత స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులను ఆ ప్రభుత్వ ఉద్యోగులైన పిల్లలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా చరామంకంలో ఉన్న వారిని వదిలించుకుంటున్నారు. కనీసం పట్టెడు అన్నం పెట్టడానికి కూడా ఇష్టాన్ని చూపించడం లేదు. పైగా సూటిపోటి మాటలు అంటూ ఇబ్బంది పెడుతున్నారు.. ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి.. ఇవి ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి వచ్చాయి. దీంతో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read: ఆకాశంలో సగం.. అవినీతిలోనూ సగం..ఏం మహిళాధికారులమ్మా!
ప్రభుత్వ ఉద్యోగులై ఉండి.. వారి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు. శాఖపరమైన చర్యలు మాత్రమే కాకుండా వారి వేతనంలో 15% వృద్ధ తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తామని హెచ్చరించారు. కేవలం హెచ్చరికలు మాత్రమే కాదని.. ఇది కార్యరూపం దాల్చే విధంగా చేస్తామని రేవంత్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు.. అంతేకాదు ఈ నిర్ణయం వల్ల తమ పిల్లల్లో మార్పు వస్తుందని వారు పేర్కొంటున్నారు. “ఎంతో కష్టపడి పిల్లల్ని ఈ స్థాయి దాకా తీసుకొస్తే.. కాటికి కాళ్లు చాపిన వయసులో వారు మమ్మల్ని వదులుకుంటున్నారు. కనీసం మందు బిల్లలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులమైనందున ప్రభుత్వం నుంచి పింఛన్ రావడం లేదు. అలాంటప్పుడు పిల్లల మీదనే ఆధారపడాల్సి వస్తోంది. వారేమో మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇలాంటప్పుడు గత్యంతరం లేక గ్రీవెన్స్ డే లలో ఫిర్యాదు చేయాల్సి వస్తోంది. మా పిల్లల మీద మేమే వ్యతిరేకంగా చెప్పాలంటే బాధ కలుగుతోంది. కాకపోతే మాకు ఇది తప్పడం లేదు. మా మొరను ఆలకించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. దీనిని ఆలస్యంగానైనా అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ” ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు చెబుతున్నారు..
Also Read: అరె.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు పెద్ద చిక్కే వచ్చిపడిందే!
ముఖ్యమంత్రి తీసుకొన్న ఈ నిర్ణయం పట్ల అన్ని వర్గాల నుంచి సహేతుకమైన స్పందన వస్తుంటే.. భారత రాష్ట్ర సమితి మాత్రం వ్యతిరేకంగా స్పందించింది. 15% వేతనాల కోత ఏమో గాని.. వారిని ఇబ్బంది పెట్టే నిర్ణయం అంటూ వ్యాఖ్యానించింది. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలలో లోటుపాట్లు ఉంటే వ్యతిరేకించాలి. రాష్ట్రానికి ఏమైనా అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించాలి. అంటే తప్ప ఇలాంటి మంచి నిర్ణయాన్ని కూడా తప్పు పట్టడం నిజంగా ఆ పార్టీలో ప్రజలకు ఉన్న ఆ కాస్త పరపతిని కూడా దూరం చేస్తుంది.