Ravi Prakash: టీవీ9 సీఈవోగా రవి ప్రకాష్ సుపరిచితుడు. అంతకంటే ముందు అతడు తేజ టీవీలో జర్నలిస్టుగా పనిచేశాడు. సిటీ కేబుల్ లో కూడా పాత్రికేయుడిగా పని చేశాడు. కొన్ని సందర్భాలలో తన ధైర్యంతో మావోయిస్టులతో సంచలన ఇంటర్వ్యూలు నిర్వహించాడు. టీవీ9 ఏర్పాటుచేసి.. 24 గంటల పాటు వార్త ప్రసారాలను చేసి.. సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. అందువల్లే పాత్రికేయ లోకంలో రవి ప్రకాష్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
టీవీ9 సంస్థలో ఆర్థికంగా అవకతలకు పాల్పడినట్టు అప్పట్లో రవి ప్రకాష్ మీద ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఆయనను బలవంతంగా టీవీ9 నుంచి బయటికి పంపించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. టీవీ9 సీఈఓ గా ఉన్నప్పుడు ఆర్థికంగా అవకతవకలకు పాల్పడినట్టు రవి ప్రకాష్ మీద ఆరోపణలు రావడంతో.. మనీలాండరింగ్ కేసు నమోదయింది. దీనిపై రవి ప్రకాష్ కు enforcement directorate షాక్ ఇచ్చింది. టీవీ9 సీఈవోగా ఉన్నప్పుడు రవి ప్రకాష్ ఉద్యోగుల జీతాలకు సంబంధించిన 18 కోట్లకు పైగా డబ్బులను సంస్థ ఖాతా నుంచి డ్రా చేసినట్టు enforcement directorate కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ కు పాల్పడినట్టు అభియోగాలు మోపింది.
ఇటీవల కేసు విచారణకు హాజరుకాకుండా రవి ప్రకాష్ తప్పించుకుని తిరుగుతున్నట్టు enforcement directorate గుర్తించింది. ఈ నేపథ్యంలో రవి ప్రకాష్ మీద మరో కేసును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసింది. ఈ కేసు లో విచారణ జరిపిన enforcement directorate రవి ప్రకాష్ ను ముద్దాయిగా గుర్తించింది. సెషన్స్ కోర్టు 1000 రూపాయలను అపరాధ రుసుము చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఒకవేళ ఫైన్ చెల్లించకుండా ఉంటే వారం పాటు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పులో ప్రకటించింది.
బ్రేకింగ్ న్యూస్
TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు వారం రోజుల జైలు శిక్ష?
ఉద్యోగుల జీతాలు వాడుకున్నాడా?
మనీ లాండరింగ్ కేసులో TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఈడీ షాక్
టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.18 కోట్లకు పైగా డబ్బులను కంపెనీ ఖాతా నుంచి విత్ డ్రా… pic.twitter.com/WEqYKg6fSN
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2026