https://oktelugu.com/

Congress Manifesto: తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మేనిఫెస్టో.. హామీలు ఏంటో తెలుసా?

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసింది. పాంచ్‌ న్యాయ్‌.. పచ్చీస్‌ గ్యారంటీ పేరుతో దీనిని విడుదల చేశారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్రంలో మెజారిటీ లోక్‌సభ సీట్లు గెలవడమే లక్ష్యంగా జాతీయ మేనిఫెస్టోకు అనుబంధంగా తెలంగాణలోని అంశాల ఆధారంగా మరో మేనిఫెస్టో విడుదల చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 3, 2024 / 02:39 PM IST

    Congress Manifesto

    Follow us on

    Congress Manifesto: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు పేరుతో దీనిని రూపొందించారు. మేనిఫెస్టో తెలుగు ప్రతిని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ విడుదల చేశారు.

    తెలంగాణకు ప్రత్యేకంగా..
    ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసింది. పాంచ్‌ న్యాయ్‌.. పచ్చీస్‌ గ్యారంటీ పేరుతో దీనిని విడుదల చేశారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్రంలో మెజారిటీ లోక్‌సభ సీట్లు గెలవడమే లక్ష్యంగా జాతీయ మేనిఫెస్టోకు అనుబంధంగా తెలంగాణలోని అంశాల ఆధారంగా మరో మేనిఫెస్టో విడుదల చేశారు.

    హామీలు ఇవీ..
    – మేడారం జాతరకు జాతీయ హోదా
    – పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా
    – హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు
    – కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల పెంపు
    – బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు
    – కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు
    – క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి
    – వివిధ యూనివర్సిటీల ఏర్పాటు

    విభజన చట్టంలోని హామీలు..
    కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోలో విభజన చట్టంలోని హామీలు పొందు పర్చారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విభజన చట్టంలోనివే. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల పెంపు కూడా విభజన చట్టంలో ఉన్నవే.