https://oktelugu.com/

Teenmar Mallanna : ఎట్లయితే గట్లాయే.. తగ్గేదే లే.. కాంగ్రెస్ పై తొడగొట్టిన తీన్మార్ మల్లన్న.. ఏం జరుగనుంది?

మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అనుకున్న పని చేసింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని.. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీకి వ్యతిరేకంగా.. పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే తదుపరి చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 7, 2025 / 10:49 AM IST
    Show cause notice to MLC Teenmar Mallanna

    Show cause notice to MLC Teenmar Mallanna

    Follow us on

    Teenmar Mallanna : రేవంత్ రెడ్డి ఇలా అన్నారో లేదో.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చేసింది.. సోషల్ మీడియాలోనూ తీన్మార్ మల్లన్నకు జారీచేసిన షోకాజ్ నోటీసులను పోస్ట్ చేసింది. దీనిపై భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం ప్రచారం మొదలుపెట్టింది. ఇన్నాళ్లపాటు తీన్మార్ మల్లన్న పై విషం కక్కిన భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం పాజిటివ్ గా రెస్పాండ్ కావడం విశేషం. ” పార్టీ లైన్ దాటాడని.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడని.. అందువల్లే తీన్మార్ మల్లన్నకు షో కాజ్ నోటీసులు ఇచ్చారని.. ఇదీ కాంగ్రెస్ మార్కు పరిపాలన అని” భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా నిన్న సాయంత్రం నుంచి తెగ ప్రచారం మొదలుపెట్టింది. సమయం దొరికే చాలు భారత రాష్ట్ర సమితి కావాల్సినంత నెగిటివ్ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మీద చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో డిఫెన్స్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా ఫెయిల్ అవుతోంది.

    తగ్గేది లేదు

    షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తీన్మార్ మల్లన్న తొలిసారిగా రెస్పాండ్ అయ్యారు.. ఎటువంటి నోటీసులు వచ్చిన తాను భయపడేది లేదని స్పష్టం చేశారు.. నేను ఎవరి ముందు మోకారిల్లనంటూ వ్యాఖ్యానించారు..” కాంగ్రెస్ పార్టీ తీరు బాగోలేదు. బీసీ లందరికీ షోకాజ్ నోటీసు ఇచ్చినట్టుగా ఉంది. అసలు నోటీసులు ఎందుకు ఇస్తారు? అధిష్టానం ఆదేశాలను పాటించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.. అసలు షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సింది కుల గణనలో భాగమైన వారికి.. కుల గణన అనేది పూర్తిగా జానారెడ్డి నివేదిక” అని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. అధిష్టానాన్ని వెనకేసుకొస్తూనే.. స్థానిక నాయకత్వాన్ని తీన్మార్ మల్లన్న వ్యూహాత్మకంగా విమర్శిస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కుల గణన సమగ్రంగా జరగలేదని.. బీసీలకు అన్యాయం జరిగిందని.. ఓసిల జనాభాను కావాలని పెంచారని మల్లన్న పదేపదే మండిపడుతున్నారు. అదే విషయాన్ని వివిధ వేదికల వద్ద స్పష్టం చేస్తున్నారు. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైన మల్లన్న.. తదుపరి అడుగులు ఎటు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీని విడబోనని.. కాంగ్రెస్ పార్టీ నుంచి తనను బట్టి పంపడానికి మిగతా వారికి అధికారం ఎక్కడిదని తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీని వదిలి వెళ్ళేది లేదని తీన్మార్ మల్లన్న చెబుతున్నారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న వర్సెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.