Revanth Reddy : ఇప్పుడు ఎన్నికలు లేవు. ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా లేవు. అయినప్పటికీ తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారుతున్నాయి. దీనికి రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలే కారణం. ఇందులో ఓ పక్షం నాయకులు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనుకుంటే పోరబాటే. ఇందులో అధికార, ప్రతిపక్షమని తేడా లేదు. మీడియా దొరికితే చాలు.. సమయం లభిస్తే చాలు నేతలు ఏమాత్రం ఆగడం లేదు. పైగా తమ నోటికి పదును చెబుతున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా మాటలు మాట్లాడేస్తున్నారు.. ఇందులో విమర్శలు ఉన్నాయి. ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యారోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చేరిపోయారు.. శుక్రవారం హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జరిగిన జై భీం జై బాపూ, జై సం విధాన్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. సరికొత్త చర్చకు కారణమవుతున్నాయి. వాస్తవానికి రేవంత్ మనసులో అంతులేని బాధ ఉంది కాబట్టే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని నాయకులు చర్చించుకుంటున్నారు.
ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు..” మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు చాలామంది రకరకాలుగా వ్యాఖ్యలు చేశారు. మన ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు. మన నేతల మధ్య ఐక్యత ఉండదని ఆరోపించారు. కలిసి ఉండలేరని కూశారు. ఎవరెవరు ఏవేవో మాటలు మాట్లాడారు. అవన్నీ కూడా మౌనంగానే భరించాం. చూస్తూ ఉండిపోయాం. కానీ మన ఐక్యతను చేతల్లో చూపించాం. మన పనితీరును వాస్తవంలో కనబరిచాం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజల కళ్ళ ముందు తీసుకొస్తున్నామని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు..
సహజంగానే రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు. ఏ విషయాన్ని కూడా దాచుకోరు. ఆయన అలాంటి ప్రసంగాలు చేయడం వల్లే జనాలకు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. కెసిఆర్ కు ప్రత్యామ్నాయంగా నిలిచారు. ప్రజలు ఆయన నాయకత్వాన్ని బలపరిచారు. 2023 లో జరిగిన ఎన్నికల్లో ఆర్థికంగా బలంగా ఉన్న భారత రాష్ట్ర సమితిని సైతం ఢీకొట్టారంటే రేవంత్ స్టామినా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అధిష్టానం కాస్త బ్రేకులు వేసినప్పటికీ.. ఇటీవలి కాలంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇచ్చింది. దీంతో ఆయన పార్టీపై పట్టు సాధిస్తున్నారు. మంత్రివర్గంపై కూడా అప్పర్ హ్యాండ్ ప్రదర్శిస్తున్నారు. అందువల్లే ఆయన దూకుడుగా వెళ్తున్నారు. ఇటీవల బనకచర్ల వివాదంపై మొహమాటం లేకుండా మాట్లాడిన రేవంత్.. ఇప్పుడు జై భీమ్, జై బాపూ, జై సంవిధాన్ సభలో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. రేవంత్ మాట్లాడిన ప్రతి మాట కూడా భారత రాష్ట్ర సమితికి సాలిడ్ కౌంటర్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మొదటి సంవత్సరంలో 60 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం
60 వేల మందిని ఎల్బీ స్టేడియంలో తెచ్చి లెక్కపెడుదాం.. ఒక్క తల తగ్గినా కాళ్ల మీద క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా – రేవంత్ రెడ్డి pic.twitter.com/2dk8AHbpMt
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025