CM Revanth Reddy (3)
CM Revanth Reddy: తెలంగాణ(Telangana) సీఎం రేవంత్‌ర్డె.. ప్రధాని నరేంద్ర మోదీ కులంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీసీ కాదని, కన్వర్టెడ్ బీసీ అని ఆరోపించారు. తన సామాజికవర్గాని బీసీల్లోకి మార్చి తాను బీసీగా చెప్పుకుంటున్నాడని పేర్కొన్నారు. మోదీకి బీసీలు అంటే గౌరవం లేదని విమర్శించారు. దీంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రేవంత్‌కు ఇచ్చి పడేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం లేకనే సీఎం ప్రధానిపై విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్(CM Revanth) వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ కులంపై వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీపై సీఎం చేసిన పరిశోధన పూర్తిగా విఫలమైందన్నారు. 1994లో గుజారాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్పు ్పడే మోదీ కులాన్ని బీసీల జాబితాలో చేర్చిందని గుర్త చేశారు. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తించలేకపోయారని మండిపడ్డారు.
రాహుల్‌ది ఏ కులం.. ఏ మతం..
ఇదే సమయంలో మోదీ కులంపై మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఏ కులానికి చెందిన వారు. ఆయన మతం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు సీఎంకు రాహుల్(Rahul) కులం, మతం తెలుసా అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ తాతా ఫిరోజ్ జహంగీర్(Jahangir) అని గుర్తు చేశారు. హిందూ సంప్రదాయంలో తండ్రి కులానే అందరూ పటిస్తారని, ఎవరూ చట్టపంగా మతం మార్చుకున్నారో అనే చర్చ చేయాలంటే సీఎం రేవంత్‌రెడ్డి 10 జన్‌పథ్ నుంచి మొదలు పెట్టాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై దృష్టి మరల్చేందుకే రేవంత్ రెడ్డి ప్రయత్నాలని ఎద్దేవా చేశారు. బీసీ జాబితాలో ముస్లింలు ఉండొద్దని స్పష్టం చేశారు.
బీజేఎల్పీ నేత..
ఇక రేవంత్ వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(eleti Maheshwar Reddy) కూడా కౌంటర్ ఇచ్చారు. మోదీపై తప్పుడు ప్రచారం చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతావంటూ హెచ్చరించారు. రేవంత్ తన పదవి కాపాడుకునేందుకు మోదీపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశానికి బీసీ కులానికి చెందిన మోదీ ప్రధానిగా ఉండడం ఓర్వలేకనే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రాహుల్ మోదీపై చేసిన వ్యాఖ్యలతో ఎంపీ పదవికి ముప్పు తెచ్చుకున్నారని, ఇప్పుడు సీఎం రేవంత్ కూడా అదే చేస్తున్నారన్నారు.
– రేవంత్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్(Dhrmapuri Arvind), ఇతర బీజేపీ నేతలు కూడా ఖండించారు. మోదీ గురించి మాట్లాడే రేవంత్‌రెడ్డి.. ముందుగా రాహుల్ కులం, మతం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు రేవంత్ చేతగాని తనానికి నిదర్శనమని మండిపడ్డారు. కేంద్ర కేబినెట్‌లో 17 మంది బీసీలు ఉన్నారని తెలంగాణ కేబినెట్‌లో కేవలం ఇద్దరే ఉన్నారని గుర్తు చేశారు. దమ్ముంటే కేబినెట్‌లో 40 శాతం బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.