HomeతెలంగాణBandi Bhagirath POCSO case: బండి భగీరథ్‌ పోక్సో కేసు.. సత్వర విచారణకు సీఎం ఆదేశం!

Bandi Bhagirath POCSO case: బండి భగీరథ్‌ పోక్సో కేసు.. సత్వర విచారణకు సీఎం ఆదేశం!

Bandi Bhagirath POCSO case: కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర మంత్రి, కరుడుగట్టిన హిందుత్వవాది.. బండి సంజయ్‌ తనయుడు సాయిభగీరథ్‌పై ఇటీవల హైదరాబాద్‌లో పోక్సో కేసు నమోదైంది. అదే రోజు సాయి భగీరథ్‌ కూడా ఓ మైన్‌ బాలిక, ఆమె తల్లిదండ్రులపై హనీట్రాప్‌ కేసు కరీంనగర్‌ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారు. ఈ రెండు కేసులపై ఇంకా విచారణ మొదలు కాలేదు. అయితే ఇప్పటికే రాజకీయరంగు పులుముకుని విమర్శలు, ప్రతివిమర్శలతో తెలంగాఱ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సభలో బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మరోవైపు బీఆర్‌ఎస్‌పైనా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై ఆరా తీశారు. ఇది న్యాయ వ్యవస్థ పరీక్ష, ప్రజా విశ్వాసానికి పరీక్ష. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తక్షణ చర్యలకు ఆదేశించడం ఇపుపడు చర్చనీయాంశమైంది.

పోలీస్‌ల తీరుపై విమర్శలు..
ఈనెల 8వ తేదీనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. సీఎం రేవంత్‌రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటని నిలదీశారు. మోదీ పర్యటన ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉన్నారని డీజీపీ తెలిపారు. అయితే డీజీపీ సమాధానంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. 17 ఏళ్ల బాలిక హక్కులు ముఖ్యం కాదా అని నిలదీశారు. రాజకీయ నేత తనయుడు కాబట్టి వెనుకాడారా అని నిలదీశారు.

న్యాయం సంక్లిష్టం..
ఇదిలా ఉంటే ఈ కేసు సంక్లిష్టంగా ఉంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్‌ తన కుమార్తెను వేధిస్తున్నారని. కానీ అదే రోజు భగీరథ్‌ కూడా ఫిర్యాదు చేశాడు. బాలిక తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను బెదిరిస్తున్నారని.

ఎవరు నిజం చెబుతున్నారు?
ఇది కేవలం పోలీసుల విచారణ కోసం వదిలివేయాలి. కానీ ప్రశ్న మిగిలిపోతోంది. రాజకీయ నేత తనయుడు కాబట్టి ప్రత్యేక ప్రాసిక్యూషన్‌ ఉందా? లేదా నిజమైన బాధితురాలికి న్యాయం లభిస్తుందా?

సీఎం కీలక ఆదేశాలు..
మరోవైపు ఈ కేసుపై విచారణ వేగవంతం చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో డీజీపీ ఆనందర్‌ కూకట్‌పల్లి డీసీపీ రుతురాజ్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

రంగంలోకి బాలల హక్కుల కమిషన్‌..
పోక్సో కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ స్పందించింది. చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి సీపీ నుంచి పూర్తి వివరాలు కోరారు. ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేశారు. బాలల హక్కుల విషయంలో ఏ వ్యక్తి అయినా, ఏ స్థానం అయినా సమానం అనేలా చర్యలు ఉన్నాయి.

ఈ కేసు పరిష్కారం ద్వారా రాష్ట్రం న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచగలదు. లేదా కోల్పోయి, అనేక ప్రశ్నలను మిగిల్చివేస్తుంది. న్యాయం ముందు సమానత్వం కేవలం మాట కాదు, 17 ఏళ్ల బాలిక హక్కులు రక్షించబడతాయా లేదా అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version