HomeతెలంగాణBandi Sanjay singing video viral: పాట పాడిన బండి సంజయ్.. వినే దమ్ముందా?

Bandi Sanjay singing video viral: పాట పాడిన బండి సంజయ్.. వినే దమ్ముందా?

Bandi Sanjay singing video viral: అధికారులు, నాయకులు తమలోని కళను అదురుగా బయటపెడుతుంటారు. ఇటీవల రాష్ట్ర మంత్రి సీతక్క సమ్మక, సారలమ్మ జాతర సందర్భంగా పాటపాడారు. ఈ పాటకు సోషల్‌ మీడియాలో భారీగా వ్యూస్‌ వచ్చాయి. గతంలో కరీనగర్‌ కలెక్టర్‌గా పనిచేసిన పమేలా సత్పతి కూడా పాటపాడారు. తాజాగా కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్, ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సదర్భంగా సంఘ్‌ గీతాన్ని తాను ఆలపించి ప్రత్యేక ఆకర్షణ నిలిపారు. ఈ భక్తిరస పాట ద్వారా సంస్థ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్తాయని సంఘ్‌ నేతలు చెబుతున్నారు.

సంఘ్‌తో అనుబంధం..
చిన్నతనం నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల్లో పాల్గొని పెరిగిన సంజయ్, దేశభక్తి భావాలను గానం రూపంలో వ్యక్తీకరించారు. గతంలో హైదరాబాద్‌పై సెటైర్‌ పాట పాడారు. గతంలో హైదరాబాద్‌లో ’పారణి ఇంకా ఆరణలేదు’ అంటూ సెటైర్‌ పాటలు పాడి, స్టేజీలపై భావోద్వేగ గీతాలతో ఆకట్టుకున్నారు. ఈసారి ఆధ్యాత్మిక స్వరాలతో ప్రేక్షకులను అలరింపజేశారు.

కరీంనగర్‌లో విడుదల..
రామ నవమి పండుగ సందర్భంగా కరీంనగర్‌లో ఈ గీతాన్ని అధికారికంగా ఆవిష్కరిస్తారు. స్థానిక బీజేపీ కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు పాల్గొనే ఈ కార్యక్రమం రాజకీయ–సాంస్కృతిక ఉత్సవంగా మారనుంది.

సంగీతం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ వారసత్వాన్ని యువతకు అందించడం బండి సంజయ్‌ వినూత్న వ్యూహం. తెలంగాణలో బీజేపీ ఆదరణ పెంచడానికి, ప్రజలతో భావాత్మక సంబంధం ఏర్పరచడానికి ఇది సహాయపడుతుంది. రామ నవమి వేదికగా ఈ ప్రయత్నం పార్టీ గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న...
Oktelugu Epaper
Exit mobile version