HomeతెలంగాణKTR son post goes viral: సిట్ నోటీసుల వేళ తాత కేసీఆర్ పై కవిత.....

KTR son post goes viral: సిట్ నోటీసుల వేళ తాత కేసీఆర్ పై కవిత.. కేటీఆర్ కొడుకు పోస్ట్ వైరల్

KTR son post goes viral: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటింది. సజాబుగానే పాలన సాగుతోంది. అయితే విపక్షాలు ఎన్నికల షమయంలో ఇచ్చిన హామీలపై అధికార పార్టీని నిలదీస్తున్నాయి. ఇక రేవంత్‌రెడ్డి కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన సమయంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీస్తున్నారు. తాజాగా సింగరేణి బొగ్గు గని టెండర్ల విషయం ప్రభుత్వానికి నెగెటివ్‌గా మారడంతో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు తెరపైకి తెచ్చారు. హరీశ్‌రావు, కేటీఆర్‌కు సిట్‌తో నోటీసులు ఇచ్చి విచారణ చేయించారు. ఇక ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. కేసీఆర్‌ సమయం కోరడంతోపాటు ఫామ్‌హౌస్‌లో విచారణ చేయాలని లేఖ రాశారు. కానీ, సిట్‌ కేసీఆర్‌ రిక్వెస్ట్‌ను తిరస్కరించింది. హైదరాబాద్‌ నందనగర్‌లో విచారణకు ఆదివారం(ఫిబ్రవరి 1న) సిద్ధంగా ఉండాలని మళ్లీ నోటీసులు పంపింది. ఈ క్రమంలో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేయిస్తున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిని కేసీఆర్‌ మనుమడు, కేటీఆర్‌ తనయుడు హిమాన్షు ఫేజ్‌బుక్‌లో పోస్టు చేశాడు.

ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేయిస్తున్న కేసీఆర్‌..
హిమాన్షు పోస్టు చేసిన పొటోలో కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేయిస్తున్నారు. ఈ చిత్రం రాజకీయ ఒత్తిడుల మధ్య ఆయన స్వచ్ఛంద స్థితిని ప్రతిబింబిస్తోంది. హిమాన్షు ఈ ఫొటోతోపాటు ‘ఆ గుండెకు మట్టి తాకితే నాకు సంతృప్తి.. మూలాలను మరువని మహానీయుడు కేసీఆర్‌’ అంటూ రాసిన క్యాప్షన్‌ ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చింది.

స్పందిస్తున్న నెటిజన్లు…
సిట్‌ దర్యాప్తు ఒత్తిడిలో ఈ పొటో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు ఊరటనిచ్చింది. ఆయన గొర్రెలు, పొలాలతో అనుబంధాన్ని చాటుకున్న ఈ చిత్రం వైరల్‌ కావడంతో #KCRFarmer హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. నెటిజన్లు ఆయన సరళతను ప్రశంసిస్తూ మీమ్‌లు, కామెంట్లు పెడుతున్నారు.

సిట్‌ నోటీసులు రాజకీయ డైవర్షన్‌గా కనిపించిన సమయంలో తాజా కేసీఆర్‌ ఫొటో బీఆర్‌ఎస్‌ ఇమేజ్‌ను రీబ్రాండ్‌ చేస్తోంది. కేసీఆర్‌ రైతు మూలాలు, స్థిరత్వాన్ని హైలైట్‌ చేస్తూ సపోర్టర్లను ఏకం చేస్తుంది. ఇది కేవలం వ్యక్తిగత ఉత్సాహమా లేక రాజకీయ కౌంటర్‌గా వ్యూహాత్మకంగా రూపొందించినదా అనేది చర్చనీయాంశంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version