కరోనా సమయంలో పోలీసుల సేవలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్యాగధనులకు సమాజం రుణపడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో పోలీసులు విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉన్నారన్నారు.సమాజ భద్రత, ఉజ్వల భవిష్యత్ కోసం ఎందరో పోలీసులు త్యాగం చేశారన్నారు.