
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్ఠానందే తుది నిర్ణయమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ అన్నారు. పీసీసీ ఎంపికపై మొదటిసారిగా అభిప్రాయ సేకరణ జరిపామన్నారు. తాను సేకరించిన అభిప్రాయాలను సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి సమర్పించారన్నారు. వారి నిర్ణయం ప్రకారమే అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందన్నారు. కేసులకు భయపడి కేసీఆర్ బీజేపీని శరణు కోరాడని మాణిక్కం ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబంపై ఆరు నెలల పాటు ఐటీ, ఈడీ దాడులు ఉండవన్నారు. కేసీఆర్, ప్రధాని మోడీ భేటీపై బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇప్పడేం మాట్లాడుతారన్నారు. ప్రజాధరణ లేని నాయకులే కాంగ్రెస్ ను వీడుతున్నారన్నారు.