
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పతనం ప్రారంభమైందని, ఇక అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆమె మొదటిసారిగా గురువారం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చా రు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలసి ఆమె మీడియా తో మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన విద్యార్థుల శవాల పై కూర్చొని కేసీఆర్ పరిపాలిస్తున్నారన్నారు.