
హైదరాబాద్‌లోని పలు పబ్బులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఈ పబ్‌లు నిర్వహిస్తున్నారని జూబ్లిహిల్స్‌లోని పలు పబ్బుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా నాలుగు పబ్ సెంటర్లలో జరగుతున్న కార్యకలాపాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. దీంతో తబలారస, ఎయిర్‌లైవ్, కెమెస్ట్రీ, అమ్మేసియా పబ్‌లపై కేసులు నమోదు చేశారు. అలాగే అనుమతులు లేకుండా డాన్సఫ్లోర్ని తెచ్చిన పబ్‌లపై మీద కేసులు నమోదు చేశారు. మాస్క్‌లు ధరించకుండా వచ్చిన వారికి సర్వీసు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అందుకే ఈ దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు.