
హైదరాబాద్లోని మెట్రో రైలు సేవలు చాలా సేపు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్య కారణంగా దాదాపు అరగంట పాటు రైళ్లను అధికారులు నిలిపివేశారు. దీంతోప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అసెంబ్లీ స్టేషన్ నుండి అమీర్ పేట వైపు వెళ్లే రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే రోజువారీ పనులకు వెళ్లేవారు అవస్థలకు గురయ్యారు. కాగా ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలో సాంకేతిక సమస్య వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ పలుమార్లు సాంకేతిక సమస్యలతో మెట్రో సేవలు నిలిచిన విషయం తెలిసిందే.