
హైదరాబాద్ లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యపేట జిల్లా పాలకీడు మండలం బత్తులపాలెంకు చెందిన మధు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ లోని రాణిగంజ్ ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కార్యాలయం వద్ద తన ఎస్ఎల్ఆర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ కు భార్య ఇద్దరు పిల్లలున్నారు.