
కరోనా నేపథ్యంలో ఆరు నెలల పాటు అంతర్రాష్ట బస్సు సర్వీసులకు బ్రేక్ పడ్డాయి. ఆన్‌లాక్‌లో భాగంగా ఆర్టీసీ బస్సులు ఇదివరకే ప్రారంభమయ్యాయి. కానీ అంతర్రాష్ట్ర సర్వీసులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ కొన్ని అవసరాల నిమిత్తం అంతర్రాష్ట సర్వీసులను ప్రారంభించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. దీంతో సోమవారం నుంచి చంద్రపూర్, నాగ్‌పూర్, నాందేడ్, బీదర్, రాయచూర్ ప్రాంతాలకు బస్సులు నడిపించనున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన బస్సులు కూడా ప్రారంభం కానున్నాయి.
Also Read: ‘కాసు’పత్రుల కరోనా దోపిడీ