
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఒక రోజు కేసులు తగ్గుతూ ఉంటే మరొక రోజు కాస్త పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 612 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,76,516 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,485 మంది మృతి చెందారు. తాజాగా 502 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,67,427 మంది కోలుకున్నారు.