
ఉపాధి కల్పనలో దేశంలో నెంబర్ వన్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న అవార్డులతోపాటు, రావాల్సిన పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి నరేంద్రసింగ్ తోమర్కు లేఖ రాశారు.