
మహబూబాబాద్ జిల్లాలో దీక్షిత్‌రెడ్డి హత్యపై పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టారు. ‘ఈ ఆదివారం సాయంత్రం దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేశారు.. రెక్కీ నిర్వహించి సీసీ కెమెరాల్లో దొరక్కకుండా జాగ్రత్తపడ్డారు. కిడ్నాప్ చేసిన గంటన్నరకే బాలుడి గొంతు నులిమి హత మార్చారు. ఈ విషయం దాచిపెట్టి రూ. 45 లక్షలు డిమాండ్ చేశారు. టెక్నాలజీని ఉపయోగించి నిందితులను పట్టుకున్నాం. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని’ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.