
తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో సీఎం పీటం కోసం పంచాయితీ నడుస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఆరోపించారు. ఆదివారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డుతూ దుబ్బాక ఉప ఎన్నికపై చర్చించేందుకు ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం రాబోతుందని తెలిపారు. బీజేపీ ఎక్కడుందోనని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, ఆ విషయాన్ని కవితను, వినోద్ కుమార్ లను అడగమని పేర్కొన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని మభ్యపెట్టి మాటమార్చారన్నారు.