
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు హైకోర్టులో చుక్కెదురయింది. ఓటుకు నోటు కేసులో తన పేరును తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం వీరయ్య పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నెల 15న రేవంత్‌రెడ్డితో పాటు సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్య కూడా ఏసీబీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.